Court Telugu Movie Review : చాలా మంది కొత్త దర్శకులు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ విజయాలను అందుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం షేక్ చేస్తున్నారనే చెప్పాలి. ఇక చిన్న సినిమాల విషయానికి వస్తే డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను మైమరపింప చేస్తున్నారు. నాని ప్రొడ్యూసర్ గా రామ్ జగదీష్ డైరెక్షన్ లో వచ్చిన ‘కోర్టు’ సినిమా రేపు రిలీజ్ అవుతున్నప్పటికి నిన్న నైట్ నుంచే పెయిడ్ ప్రీమియర్స్ అయితే వేశారు…మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే చందు అలియాస్ చంద్రశేఖర్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి చిన్న చితిక పనులు చేసుకుంటూ ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. 17 సంవత్సరాల జాబిలి తో సన్నిహిత్యంగా ఉంటూ తనను ప్రేమిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న జాబిలి వాళ్ళ ఫాదర్ మైనర్ అయిన జాబిలి ని చందు మాయమాటలు చెప్పి మోసం మోసగిస్తున్నాడనే ఉద్దేశ్యంతో అతని మీద పాక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది..? ఆ కుర్రాడు జైల్ కి వెళ్ళాడా లేదంటే తను ఏ తప్పూ చేయలేదని ప్రూవ్ చేసుకున్నాడా.? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాలను బేస్ చేసుకొని రామ్ జగదీష్ ఈ సినిమా రాసుకున్నాడు. ఒక పాక్సో చట్టం కు సంబంధించిన విషయాలను సైతం ప్రేక్షకులకు క్లియర్ కట్ గా తెలిసే సీన్స్ ని కూడా రాసుకున్నాడు. అయితే ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకు ఎంగేజింగ్ గా తీసుకెళ్లాలనే ప్రయత్నమైతే చేశాడు. మొదట్లో కొంతవరకు కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా సాగిన ఈ సినిమా సెకండ్ హఫ్ కి వచ్చే సరికి కొంతవరకు సైడ్ ట్రాక్ కి వెళుతుందా అనే అనుమానం కలుగుతుంది. సినిమాని కొత్త గా ప్రజెంట్ చేయాలని అనుకున్నప్పటికి ఇందులో కొంత వరకు బోర్ కొట్టే సన్నివేశాలు అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ని చాలా ఎంగేజింగ్ గా ఎంటర్ టైనింగ్ గా తీసుకెళ్లాడు.
సెకండ్ హాఫ్ లో మాత్రం కోర్టు డ్రామా నడుస్తున్నప్పటికి మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే సీన్ ఒకటి కూడా రాలేదు. కొంతవరకు ప్రియదర్శి సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన క్యారెక్టర్ లో ఉన్న సమర్థ్యాన్ని బయటికి తీసే సన్నివేశాలు అయితే ఏమీ పడలేదు. ఇలాంటి కోర్టు డ్రామాని ఉన్నప్పుడు సీన్స్ ఎంత క్యూరియాసిటీతో ఉంటే ప్రేక్షకుల్లో అంత ఉత్కంఠ పెరుగుతుంది. అలాగే సినిమా చూసిన తర్వాత ప్రతి ఆడియన్ సాటిస్ఫై అవుతాడు. అలా కాకుండా సినిమా చూశాక ఈ మూవీ లో ఏదో ఒక అసంతృప్తి తో ప్రేక్షకులు బయటికి వచ్చాడు అంటే ఆ సినిమా ప్రేక్షకుడి ఎమోషన్స్ ను ఇంకా ఫుల్ ఫిల్ చేయలేదనే అర్థం… మరి ఈ సినిమాని చూసి బయటికి వచ్చిన తర్వాత కూడా అలాంటి ఫీల్ అయితే కలుగుతుంది.
అక్కడక్కడ దర్శకుడు సినిమా గ్రాఫ్ ని పెంచే ప్రయత్నం చేసినప్పటికి అది కొన్నిసార్లు వర్క్ అయితే మరికొన్ని సార్లు వర్కౌట్ కాలేదనే చెప్పాలి… బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ను ఎలివేట్ చేసే ప్రయత్నమైతే చేశారు. కొంతవరకు ఎమోషన్స్ బాగా హ్యాండిల్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం కొంతవరకు తడబడ్డాడు. ఇక దర్శకుడికి మొదటి సినిమా కావడం వల్లే అలాంటి కొన్ని తడబాట్లు ఎదురయ్యాయనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ప్రియదర్శి లాయరుగా ఒక మంచి పాత్రనైతే పోషించాడు. ఇక ఈ పాత్రలో తను బెస్ట్ పర్ఫామెన్స్ ని ఇచ్చాడు… హర్ష రోషన్ కూడా చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. శ్రీదేవి కూడా చాలా బాగా నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేసింది. శివాజీ మాత్రం పరువు కోసం ఏదైనా చేసే పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి నటించాడు. ఇక ఇన్ని రోజులు తను సినిమా ఇండస్ట్రీకి కొంతవరకు దూరంగా ఉంటూ వస్తున్నప్పటికి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చాలా అద్భుతమైన పాత్రలను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పండించిన విలనిజం నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి.
ఇక మీద నుంచి ఆయనకు విలన్ గా మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు కూడా ఉన్నాయి… హీరోయిన్ మదర్ గా చేసిన రోహిణి గారు చాలా అద్భుతమైన పర్ఫామెన్స్ అయితే ఇచ్చారు. తన కూతురి వల్ల ఒక కుర్రాడి జీవితం నాశనం అయిపోతుందని మదన పడుతూ ఉంటుంది. ఆమె అప్పటికి తనలో తానే పడే స్ట్రగుల్స్ అనేవి చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు…
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన విజయ్ బుల్గానిన్ చాలా మంచి మ్యూజిక్ అయితే అందించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా సెట్ అయింది. ప్రతి షాట్ ని చాలా డిజైనింగ్ గా చెప్పే ప్రయత్నమైతే చేశారు. అలాగే కోర్టు డ్రామా షాట్స్ చాలా లిమిటెడ్ గా వాడినప్పటికి ఆ బ్లాక్స్ తోనే సినిమాలోని ఎమోషన్ ని పండించే ప్రయత్నం చేయడం అనేది సినిమాటోగ్రాఫర్ యొక్క టాలెంట్ కి మెచ్చుకోవాలి…ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి…
ప్లస్ పాయింట్స్
స్టోరీ
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్
మైనస్ పాయింట్స్
కోర్టు డ్రామా అనుకున్న రేంజ్ లో ఎలివేట్ కాలేదు…
బోరింగ్ సీన్స్
సెకండ్ హాఫ్ కొంత లాగ్ అయింది…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5