Court Movie Heroine: ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులారిటీ ని సంపాదించి, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీలు మన ఇండస్ట్రీ లో చాలా తక్కువగా ఉంటారు. ఇన్ స్టాగ్రామ్ లో సెలబ్రిటీ స్టేటస్ ని పొందిన తర్వాత బుల్లితెర పై పలు ఎంటర్టైన్మెంట్ షోస్ లో వీళ్ళు కనిపిస్తారు. తద్వారా వచ్చిన పాపులారిటీ తో అదృష్టం బాగుంటే సినిమాల్లోకి వెళ్తారు, లేదంటే బిగ్ బాస్ షో లోకి ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, జనాలకు మరింత దగ్గరై సినిమాల్లో అవకాశాలు వస్తే వెళ్తారు. ఇలాంటి వాళ్లనే మనం ఇన్ని రోజులు చూశాము. కానీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా పాపులారిటీ ని సంపాదించి నేరుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళను మనం చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు. ఆ అతి కొద్దిమందిలో ఒకరే కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి. ఈ ఏడాది కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన కోర్ట్(Court Movie) చిత్రం లో శ్రీదేవి(Sridevi) ఎంత అద్భుతంగా నటించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also Read: హృతిక్ రోషన్ హిస్టరీ గురించి ఎన్టీఆర్ కి తెలియదా..? అలా ఎలా నోరు జారాడు?
ఈ సినిమా ద్వారా ఆమె కోట్లాది మంది తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. అంతే కాదు ఈమెకు ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు వరుసగా క్యూలు కడుతున్నాయి. వీటితో పాటు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, రెస్టారంట్ ఓపెనింగ్స్ కి వెళ్తూ రెండు చేతుల్లో డబ్బులు బాగా సంపాదిస్తుంది. ఇంత చిన్న వయస్సులో ఈ రేంజ్ లో సంపాదించడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె ఎప్పుడూ చాలా యాక్టీవ్ గా ఉంటుంది. రీసెంట్ గా రక్షా బంధన్ సందర్భంగా ఆమె కొంతమందికి రాఖీలు కడుతూ కనిపించింది. జనాలు ఆమె చేత రాఖీ కట్టించుకుంటున్నది ఎవరు అనేది చూడడం కంటే, శ్రీదేవి ని ఎక్కువగా గమనించారు. అలా గమనించినప్పుడు ఆమె మెడలోని పసుపు తాడుని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు.
Also Read: ‘బిగ్ బాస్’ లేకుండానే ‘బిగ్ బాస్ 9’..ఈ సీజన్ కాన్సెప్ట్ చూస్తే మతిపోతుంది!
పెళ్లి జరిగిన వాళ్ళే ఈ పసుపు తాడుని ధరిస్తారు. కొన్ని రోజులు అయ్యాక పసుపు తాడుకి బదులుగా గోల్డ్ చైన్ కి మంగళ సూత్రం తగిలిస్తారు. అయితే శ్రీదేవి పసుపు తాడు కట్టుకోవడాన్ని చూసి ఈమెకు పెళ్లి ఎప్పుడు అయ్యింది?, ఎవరికీ తెలియకుండా చేసుకుందా?, వరుడు ఎవరు అంటూ ఆరాలు తీశారు. ఆమె పెళ్లి చేసుకొని ఉండకపోయి ఉండొచ్చు, ఏదైనా సినిమా షూటింగ్ లో సన్నివేశం కోసం ఆ పసుపు తాడుని ధరించి ఉండొచ్చు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేశారు. అయితే వీడియో చూస్తుంటే శ్రీదేవి తన ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. షూటింగ్ లొకేషన్ లో ఉన్నప్పుడు పసుపు తాడు ధరిస్తే సన్నివేశం కోసం అనుకోవచ్చు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా పసుపు తాడు ధరించిందంటే అర్థం ఏంటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా ఎదో జరిగింది, అది శ్రీదేవి చెప్తే కానీ తెలియదు.
View this post on Instagram