Bigg Boss 9 Updates: మరో నెల రోజుల్లో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ కి సంబంధించి ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మీరంతా వినే ఉంటారు. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొనే అవకాశాన్ని బిగ్ బాస్ టీం సామాన్యులకు కల్పించింది. వేలకొద్దీ దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా రాగా, 200 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 200 మందిలో కేవలం 100 మందిని ఇంటర్వూస్ ద్వారా ఫిల్టర్ చేశారు. ఈ వంద మందికి గ్రూప్ డిస్కషన్ ని ఏర్పాటు చేసి కేవలం 42 మందిని ‘అగ్ని పరీక్ష’ కాంటెస్ట్ కి పంపించారు. ఈ అగ్ని పరీక్ష కాంటెస్ట్ ద్వారా కేవలం 5 మంది మాత్రమే బిగ్ బాస్ లోకి సామాన్యులుగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ కాంటెస్ట్ కి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తుండగా, అభిజీత్, నవదీప్ మరియు బిందు మాధవి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.
రెండు రోజుల క్రితమే మొదలైన ఈ ‘అగ్నిపరీక్ష’ కాంటెస్ట్ షూటింగ్ ఈ నెల 19 వ తేదీ వరకు కొనసాగనుంది. ఇదంతా పక్కన పెడితే నిన్ననే ఈ సీజన్ కి సంబంధించిన కాన్సెప్ట్ ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తో పాటు వెన్నెల కిషోర్(Vennela Kishore) కూడా ఉన్నాడు. ఈ ప్రోమో లో ఈ సీజన్ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో జనాలకు ఒక ఐడియా ఇచ్చేసారు. రెండు బిగ్ బాస్ హౌస్ లు ఉంటాయి. ఒక హౌస్ శాశ్వతమైన హౌస్ అంట, మరో హౌస్ రెంటెడ్ హౌస్ అంట. రెంటెడ్ హౌస్ పరిమితమైన వసతులతో మాత్రమే ఉంటుంది. కానీ మెయిన్ హౌస్ మాత్రం లావిష్ గా, లగ్జరీ తో ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ని చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ లో నామినేట్ అయిన ఇంటి సభ్యులు రెంటెడ్ హౌస్ లో, నామినేట్ అవ్వని ఇంటి సభ్యులు మెయిన్ హౌస్ లో ఉంటారని అంచనా వేయొచ్చు.
Also Read: ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జనాలు లేరంటూ ట్రోల్స్..కానీ అసలు వాస్తవం ఇదే!
అది కాసేపు పక్కన పెడితే నిన్న విడుదల చేసిన ప్రోమో వెన్నెల కిషోర్ మాట్లాడుతూ ‘నీతో నాకు మాటలేంటి..నేను నేరుగా బిగ్ బాస్ తోనే మాట్లాడుకుంటా’ అని అంటాడు. అప్పుడు నాగార్జున ‘అందుకే బిగ్ బాస్ ని కూడా మార్చేసాం’ అని అంటాడు. అంటే ఈ సీజన్ లో అసలు బిగ్ బాస్ గొంతు వినపడదా?, ఆయనకు బదులుగా నాగార్జున నే మాట్లాడుతాడా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు ముందు సీజన్స్ లో బిగ్ బాస్ నే సూపర్ బాస్. ఆయన తీసుకునే నిర్ణయాలే ఫైనల్. కానీ ఈ సీజన్ లో హోస్ట్ నే సూపర్ బాస్ గా ఉండేట్టు ఉన్నాడు. బిగ్ బాస్ కూడా ఆయన చెప్పినట్టే వినాలేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి ఈ ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఆడియన్స్ కి ఎంతమేరకు నచ్చుతుంది అనేది.