Tollywood vs Politics: రాజకీయాలను, సినిమాలను వేరు చేసి చూడలేం. ఈ రెండు రంగాలు ఇప్పుడు ఒకదానితో ఒకటి పెన వేసుకుని ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)పొలిటికల్ ఎంట్రీ తర్వాత.. ఆయనను టార్గెట్ చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇటీవల వచ్చిన హరిహర వీరమల్లుకు సైతం నెగిటివ్ ప్రచారం తప్పలేదు. అయితే అదృష్టం ఏంటంటే ఒక పార్టీ ఒక సినిమాను వ్యతిరేకిస్తుంటే.. మరో పార్టీ దానికి మద్దతుగా నిలుస్తోంది. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తప్పడం లేదు. ముఖ్యంగా ఏపీలో అయితే పతాక స్థాయిలో ఉంది ఈ దుస్థితి. అయితే ఈ నెల 13న విడుదల కానున్న జూనియర్ ఎన్టీఆర్ చిత్రం వార్ 2 కి కూడా ఈ పరిస్థితి తప్పదని ప్రచారం నడుస్తోంది. అప్పుడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని మొదలు పెట్టేసిందని తెలుస్తోంది. శత్రువుకు శత్రువు మిత్రుడు. ప్రత్యర్థితో పొసగని వాడు కూడా తనవాడిగా చూసుకునే ప్రయత్నం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
Also Read: ప్లీజ్ పవన్ కళ్యాణ్.. అంబటి వింత కోరిక వైరల్!
అల్లు అర్జున్ విషయంలో అలా..
నంద్యాలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నేత అల్లు అర్జున్( Allu Arjun) కు ఆప్తమిత్రుడు. అయితే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి తన మద్దతు ప్రకటించారు. ఆ నేతకు శుభాకాంక్షలు తెలిపారు. అది మొదలు అల్లు అర్జున్ ను తమ వాడిగా చూసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. సహజంగానే ఇటువంటి చర్యలు మెగా అభిమానులకు ఇబ్బంది తెచ్చి పెడతాయి. అప్పటివరకు మెగా ఫ్యామిలీలో సభ్యుడిగా అల్లు అర్జున్ కు సైతం మెగా అభిమానులు ఎంతగానో అభిమానించేవారు. ఆ ఘటనతో అల్లు అర్జున్ ను విభేదించడం ప్రారంభించారు. అయితే అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంది. అప్పుడు కూడా అల్లు అర్జున్ తమ వాడిగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయన నటించిన పుష్ప2 చిత్రం విడుదల సమయంలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెగ హడావిడి చేశాయి. అదే సమయంలో మెగా అభిమానులు ఆ చిత్రంపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేశారన్న టాక్ వినిపించింది. కానీ అదంతా అభిమానుల వరకేనని.. తామంతా ఒకటేనని అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీతో ఇట్టే కలిసి పోయారు. కానీ అల్లు అర్జున్ రూపంలో తమకు ఒక అవకాశం దొరికిందని మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
Also Read: రష్మీ,అనసూయ మధ్య ఇంత గొడవ జరిగిందా..? జబర్దస్త్ స్పెషల్ ప్రోగ్రాం లో అరుదైన ఘటన!
లోకేష్ ట్వీట్ తో..
అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR) నటించిన వార్ 2 సినిమాను హిట్ చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ చిత్రంతో పాటు రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం కూడా విడుదల అవుతోంది. అయితే ఏపీ మంత్రి నారా లోకేష్ కూలి సినిమాకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రం గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్కు తెలుగుదేశం పార్టీ మద్దతు ఉండదని భావించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఆ సినిమాను తలకెక్కించుకునే పనిలో పడింది. మద్దతుగా నిలవాలని సోషల్ మీడియా ద్వారా ఇప్పటినుంచే ప్రచారం ప్రారంభించింది. సో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరి కొద్ది రోజులు పండగే నన్న మాట.