Gautam
Gautam: సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీ లోకి బాలనటుడిగా అడుగుపెట్టిన మహేష్ బాబు(Superstar Mahesh Babu), చిన్న తనంలోనే నటనలో తన టాలెంట్ ని చూపించి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. చిన్నతనం లోనే ఇతనిలో ఉన్న టాలెంట్ ని చూసి, భవిష్యత్తులో ఇతను పెద్ద సూపర్ స్టార్ అవుతాడని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టు గానే మహేష్ బాబు పెద్ద సూపర్ స్టార్ అయ్యాడు. త్వరలోనే ఆయన రాజమౌళి(SS Rajamouli) సినిమాతో అంతర్జాతీయ మార్కెట్ లో కూడా అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పుడు ఆయన తనయుడు గౌతమ్(Gautham Krishna) కూడా భవిష్యత్తులో అదే తన తండ్రి లాగానే సినీ రంగం లో ఉన్నత స్థాయికి వెళ్తాడు అనేందుకు ఒక వీడియో విడుదలైంది. ఈ వీడియో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ని అమితంగా ఆకర్షితులను చేస్తుంది. ఇంతకు ఆ వీడియో ఏమిటి?, ఎందుకు మహేష్ ఫ్యాన్స్ అంతలా దానిని లేపుతున్నారు అనేది చూద్దాం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే మహేష్ తనయుడు గౌతమ్ విదేశాల్లో చదువుకుంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. NYC స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో యాక్టింగ్ నేర్చుకుంటున్న ఆయన తన స్నేహితులతో కలిసి ఒక మీమ్ వీడియో చేసాడు. ఇందులో ఆయన ఒక అమ్మాయితో సంభాషణ జరుపుతున్నట్టు యాక్ట్ చేశాడు. వాళ్లిద్దరూ ఏమి మాట్లాడుకుంటున్నారు అనేది స్పష్టంగా మాటలు అర్థం కావడం లేదు కానీ, గౌతమ్ ఎక్స్ ప్రెషన్స్ ని చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఇటీవల కాలం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న ఎంతో మంది యంగ్ హీరోలు, ఎన్ని సినిమాలు చేసిన సరైన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం లో విఫలం అవుతున్నారు. వాళ్ళతో పోలిస్తే గౌతమ్ వెయ్యి రేట్లు బెటర్ అని మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా మాట్లాడుకుంటున్నారు. చూస్తుంటే గౌతమ్ 2029 లోపే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
గౌతమ్ గతంలో మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘1- నేనొక్కడినే’ చిత్రంలో చిన్నప్పటి మహేష్ క్యారక్టర్ చేసాడు. అప్పుడే పర్లేదు, ఇంత చిన్న వయస్సు లో మంచి ఎక్స్ ప్రెషన్స్ పెడుతున్నాడని అందరూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత గౌతమ్ సినీ హీరో గా సక్సెస్ కచ్చితంగా అవుతాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ 5 ఏళ్లలో బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ తేజ, పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్, మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నారు. వీరిలో ఎవరు సక్సెస్ అవుతారు అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే అందరూ అకిరా నందన్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. లుక్స్ పరంగా కూడా అకిరా మిగిలిన ఇద్దరు వారసులను డామినేట్ చేస్తున్నాడు. మరి అకిరా కి గౌతమ్ లాగా నటించేంత టాలెంట్ ఉందా లేదా అనేది చూడాలి.
#GautamGhattamaneni shines at NYU Tisch School of the Arts!
Gautam babu acted in mime created by his fellow students
Wishing him the best on this creative journey! ✨ @urstrulyMahesh pic.twitter.com/iPq6DrfDuk
— SSMB EMPIRE FC (@ssmb_freaks) March 21, 2025