సూపర్ రజనీకాంత్ తన పొలిటికల్ కెరీర్ కు పులిస్టాప్ పెట్టిన నేపథ్యంలో అభిమానులకు క్షమాపణలు చెప్పారు. త్వరలో ప్రకటించబోయే పార్ట ఉండదని స్పష్టం చేశారు. దీనిపై అభిమానులు అర్థం చేసుకోవాలని కోరారు. ఇటీవల హై బీపీతో ఆయన హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మూడు రోజుల చికిత్స తరువాత డిశ్చార్జి అయిన రజనీకాంత్ కు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. రజనీ కుటుంబ సభ్యులు సైతం ఇప్పట్లో పార్టీ పెడితే ఆరోగ్య సమస్యలు మళ్లీ వచ్చే అవకాశ ముందని ఒత్తిడి చేయడంతో తన పార్టీ ఉండదని రజనీ తేల్చి చెప్పారు.