https://oktelugu.com/

సీనియర్ హీరోలకు ‘కరోనా’ గుబులు తీరేదెన్నడూ?

  కరోనా ఎంట్రీతో దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో పేద.. సామాన్య.. మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వ్యాపార.. వ్యాణిజ్య సంస్థలు మూతపడటంతో కోట్లాది ప్రజలు ఉపాధిని కోల్పోయారు. కరోనాతో ఎక్కువగా నష్టపోయిన వాటిలో సినీ పరిశ్రమ తొలిస్థానంలో నిలుస్తోంది. Also Read: హాట్ టాపిక్:ఆ మూవీలో నటించే జంటలకు పెళ్లి అవుతుందా? కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగులు నిలిచిపోగా.. థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది […]

Written By:
  • NARESH
  • , Updated On : October 16, 2020 / 01:20 PM IST
    Follow us on

     

    కరోనా ఎంట్రీతో దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో పేద.. సామాన్య.. మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వ్యాపార.. వ్యాణిజ్య సంస్థలు మూతపడటంతో కోట్లాది ప్రజలు ఉపాధిని కోల్పోయారు. కరోనాతో ఎక్కువగా నష్టపోయిన వాటిలో సినీ పరిశ్రమ తొలిస్థానంలో నిలుస్తోంది.

    Also Read: హాట్ టాపిక్:ఆ మూవీలో నటించే జంటలకు పెళ్లి అవుతుందా?

    కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగులు నిలిచిపోగా.. థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారు. థియేటర్లు ప్రారంభమైన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు సినిమాలు వచ్చి చూస్తారా? అన్న నమ్మకం ఇండస్ట్రీవర్గాల్లో లేదని తెలుస్తోంది. ఇక ఇటీవలే సినిమా షూటింగులు ప్రారంభం అవడంతో టాలీవుడ్లో సందడి మొదలైంది.

    తాాజాగా సినిమా షూటింగుల్లో కొందరు నటీనటులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో వారిని ఇంటికి పంపిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని షూటింగులను వాయిదా వేసుకుంటున్నారు. మరికొందరేమో వేరే నటులతో సినిమాలను పూర్తి చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే యంగ్ హీరోలు సినిమా షూటింగుల్లో పాల్గొంటూ చకచక సినిమాలను చేస్తున్నారు.

    సీనియర్ హీరోల సినిమాలు మాత్రం పట్టాలెక్కడం లేదు. కరోనా మహమ్మరి చిన్నపిల్లల్లో.. 60ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువ ప్రభావం చూపుతుందని వైద్యులు తెలుపుతున్నారు. వీరంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. దీంతోనే సీనియర్ హీరోలు సినిమా షూటింగులకు నో అంటున్నారు. చిరంజీవి.. వెంకటేష్.. నాగార్జున.. బాలయ్య వయస్సు 60ఏళ్లు పైబడే ఉండనుంది. దీంతో వీరంతా నవంబర్లో షూటింగ్ చేయాలని భావిస్తున్నారు.

    Also Read: కొత్త లుక్కులో ఆకట్టుకుంటున్న ‘కొమురంభీం’ ఎన్టీఆర్.!

    ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో సీనియర్ హీరోల సినిమాలు ఆలస్యంగా పట్టాలెక్కేలా కన్పిస్తున్నాయి. చిరంజీవి ‘ఆచార్య’.. వెంకటేష్ ‘నారప్ప’.. బాలయ్య మూవీలు ఎప్పుడు ప్రారంభం అవుతాయా? అని అభిమానులు అత్రుతగా ఎదురు చూస్తున్నారు. సీనియర్ హీరోల్లో నాగార్జున మాత్రం ‘వైల్డ్ డాగ్’ మూవీలో పాల్గొని షూటింగ్ చేస్తుండటం విశేషం.