బిగ్ బాస్-4: ‘బార్డర్’ దాటొద్దంటూ ఆదేశం.. ఎందుకంటే?

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతున్న సంగతి తెల్సిందే. గత సీజన్ కు భిన్నంగా బిగ్ బాస్ నాలుగో సీజన్ కొనసాగుతోంది. కరోనా క్రైసిస్ లోనూ బిగ్ బాస్ నిర్వాహకులు షోను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రసుత్తం బిగ్ బాస్ 11వ వారానికి చేరుకుంది. బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంటుండటంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. Also Read: మహేష్ కు కథ చెబుతున్న డాషింగ్ డైరెక్టర్ ! బిగ్ బాస్-4 ప్రారంభానికి […]

Written By: NARESH, Updated On : November 18, 2020 7:46 pm
Follow us on

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతున్న సంగతి తెల్సిందే. గత సీజన్ కు భిన్నంగా బిగ్ బాస్ నాలుగో సీజన్ కొనసాగుతోంది. కరోనా క్రైసిస్ లోనూ బిగ్ బాస్ నిర్వాహకులు షోను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రసుత్తం బిగ్ బాస్ 11వ వారానికి చేరుకుంది. బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంటుండటంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది.

Also Read: మహేష్ కు కథ చెబుతున్న డాషింగ్ డైరెక్టర్ !

బిగ్ బాస్-4 ప్రారంభానికి ముందే నిర్వాహకులు కంటెస్టెంట్లందరికీ కరోనా టెస్టులు నిర్వహించి నెగిటివ్ వచ్చిన వారినే హౌస్ లోకి అనుమతి ఇచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే షోను నిర్వహిస్తున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చేవారికి కూడా రెండు వారాల ముందుగానే పరీక్షలు చేసి హౌస్ లోకి పంపించారు. కరోనా క్రైసిస్ కారణంగా ఈసారి బయటి నుంచి వచ్చే వ్యక్తులకు అనుమతి ఉండదనే ప్రచారం జోరుగా సాగింది.

అయితే ఈ విషయంలో బిగ్ బాస్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లలో కంటెస్టెంట్లను ఇంటి సభ్యులు కలుసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుత సీజన్లోనూ బిగ్ బాస్ తన ఆనవాయితీని కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్ల ఇంటి సభ్యులు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈమేరకు నేడు బిగ్ బాస్ లోకి ఇంటి సభ్యులు ఎంటర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మంగళవారం ఎపిసోడ్ చూసిన వారికి ఇది అర్థమైపోయి ఉంటుంది. ఇంటి సభ్యులంతా ఇప్పటికే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు కన్పించింది. వీరిలో అఖిల్.. అభిజిత్.. దేత్తడి హారిక.. అవినాష్‌ల తల్లులను చూపించారు. బుధవారం ఎపిసోడ్ కొంతమంది ఎంట్రీ ఇవ్వనుండగా మరికొందరు గురువారం హౌస్ లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: ఓటీటీలో మరో రెండు సినిమాలు.. హిట్టయ్యేనా?

గత సీజన్లలో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులంతా సాదాసీదాగానే తిరిగేవారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. హౌస్ లోకి ఎంట్రీ వారంతా ఓ బోర్డర్ దాటి లోపలికి వెళ్లద్దని ఆదేశించాడట. ఈమేరకు నిర్వాహకులు కూడా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెల్సింది.

కరోనా నేపథ్యంలో బిగ్ బాస్ ఇలాంటి రిస్కు తీసుకోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే బిగ్ బాస్ వాటన్నింటిని పట్టించుకోకుండా గత ఆనవాయితీనే కొనసాగిస్తుండటం విశేషం. కరోనాకు దడువకుండా నిర్వాహకులు ఇలాంటి సాహసం చేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్