https://oktelugu.com/

మహేష్ కు కథ చెబుతున్న డాషింగ్ డైరెక్టర్ !

ఈ కరోనా ప్రజలను ఇబ్బందులు పెట్టినా.. కొంతమంది క్రియేటివ్ పీపుల్ కు మాత్రం బాగానే మేలు చేసింది. ముఖ్యంగా ఈ లాక్ డౌన్ టైమ్ లో సినిమా దర్శకులుకు కొత్త కథలు రాసుకోవడానికి మంచి అవకాశం దొరికింది. దాంతో చాలామంది దర్శకులు కొత్త కొత్త కథలను అల్లే పనిలో పడ్డారు. ఇప్పటికే చాలామంది దర్శకులు తమ తరువాత సినిమాల కథలను పూర్తి చేసి.. హీరోలకు కూడా చెప్పి.. మొత్తానికి సినిమాలను సెట్ చేసుకున్నారు. వీరిలో హరీష్ శంకర్, […]

Written By:
  • admin
  • , Updated On : November 18, 2020 / 05:46 PM IST
    Follow us on


    ఈ కరోనా ప్రజలను ఇబ్బందులు పెట్టినా.. కొంతమంది క్రియేటివ్ పీపుల్ కు మాత్రం బాగానే మేలు చేసింది. ముఖ్యంగా ఈ లాక్ డౌన్ టైమ్ లో సినిమా దర్శకులుకు కొత్త కథలు రాసుకోవడానికి మంచి అవకాశం దొరికింది. దాంతో చాలామంది దర్శకులు కొత్త కొత్త కథలను అల్లే పనిలో పడ్డారు. ఇప్పటికే చాలామంది దర్శకులు తమ తరువాత సినిమాల కథలను పూర్తి చేసి.. హీరోలకు కూడా చెప్పి.. మొత్తానికి సినిమాలను సెట్ చేసుకున్నారు. వీరిలో హరీష్ శంకర్, త్రివిక్రమ్ దగ్గర నుండి చిన్న సినిమా డైరెక్టర్ల వరకూ ఉన్నారు. ఇప్పుడు వీరి లిస్ట్ లో మరో డైరెక్టర్ చేరాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా ఈ కరోనా టైమ్ లో ఓ స్క్రిప్ట్ ను రెడీ చేశాడట.

    Also Read: ఓటీటీలో మరో రెండు సినిమాలు.. హిట్టయ్యేనా?

    అయితే ఈ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ బాలయ్య కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాశాడని.. ఇప్పటికే పూరి, బాలయ్యకి కథ కూడా వినిపించాడని బాలయ్య కూడా పూరితో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఆ మధ్య బాగా వార్తలు వినిపించాయి. బోయపాటి సినిమా తరువాత, బాలయ్య – పూరి సినిమా ఫిక్స్ అని కూడా అన్నారు. అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో మరో న్యూస్ వినిపిస్తోంది. ఎప్పటి నుంచో పూరి మదిలో వున్న జనగనమణ సినిమా స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసి మహేష్ కి వినిపించడానికి పూరి ప్రయత్నాలు మొదలుపెట్టాడట. నిజానికి అప్పట్లోనే మహేష్ బాబుకు పూరి ఈ కథను వినిపించాడు.

    Also Read: టీజర్ టాక్.. అంధురాలిగా నయన్.. సస్సెన్స్ థిల్లర్ గా ‘నెట్రికాన్’..!

    కానీ అప్పుడు మహేష్ కి ఈ కథ నచ్చలేదు. మళ్ళీ మార్పులు చేసుకుని వస్తా అని చెప్పిన పూరి, ఆ తరువాత మళ్ళీ ఆ కథను వదిలేసి.. ఎన్టీఆర్ టెంపర్ సినిమా చేశాడు. ఆ తరువాత మధ్యలో జనగణమన సినిమాని రానాతో చేయాలని పూరి బాగానే ప్రయత్నం చేశాడు. అయితే బడ్జెట్ సమస్య కారణంగా రానా కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. కాగా ఇటివలే మహేష్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. పూరి కథ చెబితే వింటానని మాహేష్ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులుగా ఆన్సర్ చెప్పాడు. దాంతో పూరి కూడా అప్పటి నుండే మహేష్ కి కథ చెప్పడానికి స్క్రిప్ట్ రెడీ చేసి.. మొత్తానికి ఇప్పుడు చెప్పబోతున్నాడు. మరి చూడాలి.. పూరి కథ మహేష్ కి నచ్చుతుందో లేదో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్