https://oktelugu.com/

స్టార్ డైరెక్టర్ కి వెబ్ సిరీస్ కూడా కష్టమేనా ?

‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఆహా కోసం ఒక వెబ్ సిరీస్ చేయబోతున్న సంగతి తెలిసిందే. దీపావళి నాడు అధికారికంగా అల్లు అర్జునే స్వయంగా ఈ వెబ్ సిరీస్ గురించి ప్రకటించాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఈ వెబ్ సిరీస్ కోసం కూడా వంశీ.. కథను రెడీ చేసి అల్లు అరవింద్ ను ఒప్పించాలి. మరి అరవింద్ కథ ఒప్పుకోవడం అంటే.. అది ఇప్పట్లో అయ్యేపని కాదు. ఈ విషయం తాజాగా వంశీకి అర్ధమైయిందట. ఫలానా […]

Written By:
  • admin
  • , Updated On : November 18, 2020 / 05:57 PM IST
    Follow us on


    ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఆహా కోసం ఒక వెబ్ సిరీస్ చేయబోతున్న సంగతి తెలిసిందే. దీపావళి నాడు అధికారికంగా అల్లు అర్జునే స్వయంగా ఈ వెబ్ సిరీస్ గురించి ప్రకటించాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఈ వెబ్ సిరీస్ కోసం కూడా వంశీ.. కథను రెడీ చేసి అల్లు అరవింద్ ను ఒప్పించాలి. మరి అరవింద్ కథ ఒప్పుకోవడం అంటే.. అది ఇప్పట్లో అయ్యేపని కాదు. ఈ విషయం తాజాగా వంశీకి అర్ధమైయిందట. ఫలానా లైన్ మీద సిరీస్ చేస్తున్నా అంటే.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చెయ్. అప్పుడు డిసైడ్ చేద్దాం అని అరవింద్ చాలా మర్యాదగా చెప్పాడట. స్టార్ డైరెక్టర్ కాబట్టి.. మర్యాద తగ్గదు.. అలా అని అంత ఈజీగా స్క్రిప్ట్ ఓకే అవ్వదు. ఈ మధ్యలో నెలల తరబడి టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది.

    Also Read: బిగ్ బాస్-4: ‘బార్డర్’ దాటొద్దంటూ ఆదేశం.. ఎందుకంటే?

    పాపం వంశీ… అసలు మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చాక కూడా మళ్లీ సినిమా కోసం కష్టపడలా.. సరే సినిమా అంటే అనుకోవచ్చు.. వెబ్ సిరీస్ కి కూడా ఏంటి ఈ ఖర్మ. నిజానికి వంశీ తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నారు. కానీ పైడిపల్లి చెప్పిన కథ మహేష్ బాబుకు అసలు నచ్చలేదు. పోనీ మరో కథ కోసం వెయిట్ చేశాడా అంటే.. అదీ లేదు. తనకు హిట్ ఇచ్చాడు అనే కనీస మర్యాద కూడా లేకుండా వంశీకి దూరం జరిగాడు. దాంతో మహేష్ తన ప్రాజెక్ట్ పక్కన పెట్టేయడంతో వంశీ మిగిలిన హీరోల చుట్టూ తిరిగాడు.

    Also Read: మహేష్ కు కథ చెబుతున్న డాషింగ్ డైరెక్టర్ !

    ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గాని, ప్రభాస్ తో గాని చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. దాదాపు ఈ ఇద్దరి స్టార్ హీరోల్లో ఒకరితో వంశీ సినిమా ఫిక్స్ అయిందని రూమర్స్ కూడా వచ్చాయి. అయితే చివరికీ అవి కూడా కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి అనుకోండి. దాంతో వంశీ పైడిపల్లి ఆహా కోసం రెండు వెబ్ సిరీస్‌ లు చేయడానికి ఓకే చెప్పాడు. అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తూ.. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి చేత కూడా వెబ్ సిరీస్ లు చేయించాలనుకున్నాడు. కాకపోతే ఆ వెబ్ సిరీస్ ల స్క్రిప్ట్ లు ఇప్పట్లో ఫైనల్ అయ్యేలా లేవు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్