Coolie War 2 Expectations: ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభం లో ఉంది. ఈ ఏడాది బయ్యర్స్ కి చేతినిండా లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు కేవలం రెండంటే రెండే. ఒకటి ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranti Ki Vastunnam), రెండవది ‘కోర్ట్'(Court MMovie). ఈ రెండు చిత్రాలు మాత్రమే వ్యాపారం లో ఉన్న ప్రతీ ఒక్కరికి పెట్టిన ప్రతీ పైసాకు పదింతలు లాభాలు వచ్చేలా చేసిన చిత్రాలు. ఇవి కాకుండా ‘డ్రాగన్’, ‘మహావతార్ నరసింహా'(Mahavatar Narasimha), ‘చావా'(Chaava Movie) వంటి డబ్బింగ్ చిత్రాలు కూడా భారీ హిట్స్ గా నిలిచాయి. వీటి తర్వాత శ్రీవిష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన ‘సింగిల్'(Single Movie) చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇక ‘హరి హర వీరమల్లు'(Harihara Veeramallu), ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రాలు కూడా భారీ బ్లాక్ బస్టర్స్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ సంక్షోభం నుండి బయటపడుతుందని అంతా అనుకున్నారు.
కానీ ఈ రెండు సినిమాలు బయ్యర్స్ కి బోడి గుండు కొట్టేశాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెండు చిత్రాలు కూడా సమస్యల్లో ఉన్న టాలీవుడ్ ని మరింత సమస్యల్లోకి నెట్టేశాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు ‘వార్ 2′(War2 Movie), ‘కూలీ'(Coolie Movie) చిత్రాలపైనే ఉంది. ఎన్టీఆర్(Junior Ntr), హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి నటించిన ‘వార్ 2’ పై ప్రస్తుతానికి అయితే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు. కూలీ చిత్రం పైన మాత్రమే భారీ అంచనాలు ఉన్నాయి. అటు తమిళం లోనూ, ఇటు తెలుగు లోనూ ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు చిత్రాలకు కలిపి 140 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. వార్ 2 చిత్రానికి తెలుగు రాష్ట్రాలకు కలిపి 90 కోట్ల రూపాయిల బిజినెస్ జరగ్గా, ‘కూలీ’ చిత్రానికి 50 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
Also Read: పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం..చిరంజీవి కూడా ఇలా చేసి ఉండడేమో!
ఇప్పుడు వార్ 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 170 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిందే. మరి ఈ సినిమాకు అంతా సత్తా ఉందా లేదా అనేది చూడాలి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం చాలా డల్ గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలైతే ఇంతకంటే ఎక్కువ డల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోపక్క కూలీ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఈ రెండు చిత్రాలు కలిపి తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే థియేటర్స్ నుండి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు పైగా ఎట్టిపరిస్థితిలోనూ రాబట్టాల్సిందే. చూడాలి మరి మన టాలీవుడ్ ని ఈ రెండు సినిమాలు ఎంత మేరకు కాపాడుతాయి అనేది.