Balakrishna Pawan Kalyan News: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చాలా కాలం నుండి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఓజీ'(They Call Him OG). ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా మొత్తం పూనకాలు వచ్చినట్టు ఊగిపోతోంది. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ పై ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తున్నారు. మేకర్స్ వదిలే కంటెంట్ కూడా అలాగే ఉన్నాయి మరి. రీసెంట్ గా విడుదల చేసిన ‘ఫైర్ స్ట్రోమ్'(Fire Storm) లిరికల్ వీడియో సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. సంగీత దర్శకుడు థమన్ స్వరపరిచిన ఈ పాటకు మూవీ లవర్స్ అడిక్ట్ అయిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా లిరికల్ వీడియో సాంగ్ లోని విజువల్స్ ని చూసి అందరికీ మైండ్ బ్లాస్ట్ అయ్యినంత పని అయ్యింది.
Also Read: ‘అతడు’ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా ఉన్నాయేంటి..?
ఎందుకంటే ఇంత టెక్నాలజీ తో ఈ రేంజ్ క్వాలిటీ తో ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ఒక్క పాట కూడా రాలేదు. హాలీవుడ్ రేంజ్ స్టాండర్డ్స్ తో ఈ పాటని కంపోజ్ చేశారు. ఇక రెండేళ్ల క్రితం విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. నేడు ఈ చిత్రంపై ఈ రేంజ్ హైప్ క్రియేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఆ చిన్న గ్లింప్స్ వీడియో మాత్రమే. అంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమా విడుదల తేదీ విషయం లో అభిమానుల్లో చిన్న భయం ఉండేది. ఎందుకంటే ఈ సినిమా విడుదలయ్యే రోజునే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ 2′(Akhanda 2 Movie) ని కూడా విడుదల చేసేందుకు ఆ చిత్ర నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితి లోనూ ఆ తేదీ నుండి కదిలేందుకు సిద్ధంగా లేము అన్న విధంగా ఆ మూవీ టీం ప్రవర్తించింది.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రామిదే.. డైరెక్టర్ ఎవరంటే!
కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ సినిమా అధికారికంగా సెప్టెంబర్ 25 నుండి తప్పుకుందట. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి భారీ ఆఫర్ ఇచ్చింది. కానీ సెప్టెంబర్ 25 కి అయితే మా దగ్గర స్లాట్ ఖాళీ లేదని, వేరే ఏదైనా డేట్ చూసుకోమని చెప్పడం తో అఖండ 2 టీం డిసెంబర్ మొదటి వారం లో విడుదల చేసేందుకు సిద్దమైందట. అమెజాన్ ప్రైమ్ సంస్థకి కూడా ఆ డేట్ నచ్చడంతో, ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో వాయిదా వేశారని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. అలా పవన్ కళ్యాణ్ సినిమాకు లైన్ క్లియర్ చేస్తూ బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయం పై పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి కృతఙ్ఞతలు వెలువడుతున్నాయి.