Revanth Reddy Chandrababu: తెలుగు రాష్ట్రాల( Telugu States ) ముఖ్యమంత్రులు ఒకే వేదికపై వచ్చారు. అందుకు ఢిల్లీ వేదికగా నిలిచింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా తెలంగాణకు సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి. తరువాత ఏపీ ఎన్నికల్లో గెలిచారు చంద్రబాబు. అయితే సన్నిహితులుగా ముద్రపడిన వీరు నేరుగా కలిసి చర్చలు జరిపిన దాఖలాలు లేవు. మర్యాదపూర్వక సమావేశాలు మాత్రమే కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల బనకచర్ల ప్రాజెక్టు వివాదం తెరపైకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య కొద్దిపాటి మాటల యుద్ధం నడిచింది. కలిసి కూర్చుందామని చంద్రబాబు ప్రతిపాదన చేశారు. బనకచర్లకు నో చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఈరోజు వీరిద్దరూ దేశ రాజధాని వేదికగా కలుసుకోవడం మాత్రం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read: BJP cabinet Updates: మారుతున్న బిజెపి లెక్క.. పురందేశ్వరికి బిగ్ ఆఫర్!
పరస్పరం సన్నిహితులే..
రేవంత్ రెడ్డి( Revanth Reddy ) చంద్రబాబు శిష్యుడు అని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. దానికి రేవంత్ కూడా ధీటుగా సమాధానం చెబుతుంటారు. చంద్రబాబు విషయంలో సానుకూలంగా స్పందిస్తుంటారు. అదే సమయంలో చంద్రబాబు సైతం రేవంత్ విషయంలో సానుకూలంగా కనిపిస్తుంటారు. వీరిద్దరూ కలిపి విభజన సమస్యలపై కూడా దృష్టి పెట్టారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను ఢిల్లీలోని జలశక్తి శాఖ కార్యాలయంలో సంబంధిత మంత్రి సి ఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. వారితో పాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తంకుమార్ రెడ్డి సైతం పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ కార్యదర్శిలు, ఇంజనీర్లు సైతం ఈ బృందంలో ఉన్నారు.
ఎవరి వాదన వారిదే..
అయితే సింగిల్ ఎజెండాగా ఏపీ నుంచి బనకచర్ల ప్రాజెక్టు( bankacharla ) అంశం వెళ్ళింది. కానీ తెలంగాణ నుంచి 13 రకాల ప్రతిపాదనలు వచ్చాయి. బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. మిగులు జలాల పేరిట కృష్ణా నది జలాలను ఈ ఈ ప్రాజెక్టుకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానిస్తోంది. అందుకే తెలంగాణ అభ్యంతరాలతో కేంద్రం అనుమతులకు నిరాకరణ తెలిపింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వచ్చి చర్చించాలని కేంద్రం సూచించింది.
Also Read: Botsa vs Ashok Gajapathi: బొత్స కుటుంబంలో చీలిక!
దీంతో ఇరువు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జల్ శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ ను కలిశారు. అయితే బనకచర్ల తప్పించి మిగతా అంశాలు చర్చిద్దామని తెలంగాణ పట్టు పట్టినట్లు తెలుస్తోంది. కానీ ఏపీ నుంచి సింగిల్ అజెండా ప్రతిపాదనగా బనకచర్ల వెళ్ళింది. తెలంగాణ నుంచి మాత్రం 13 ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో ఇప్పుడు గురు శిష్యులు ఎలా దీనిపై ముందుకెళ్తారు? ఏం చర్చించారు అన్నది ఈరోజు తేలిపోనుంది. అయితే తెలంగాణ ముండిపట్టుగా ముందుకు వెళితే మాత్రం రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.