Coolie overseas business: సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth) నటించిన ‘కబాలి’ చిత్రం గుర్తుందా..?, ఇండియా వైడ్ గా ఆరోజుల్లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. రజనీకాంత్ పీక్ స్టార్ స్టేటస్ ని చూపెట్టిన చిత్రమిది. కేవలం ఒకే ఒక్క టీజర్ తో ఆడియన్స్ ని మెంటలెక్కిపోయేలా చేసింది ఈ చిత్రం. ఆ టీజర్ ద్వారా వచ్చిన క్రేజ్ కి రజనీకాంత్ క్రేజ్ తోడై, ఈ సినిమా టికెట్స్ దొరికితే చాలురా బాబు అని అనుకునేవాళ్లు అప్పట్లో ఆడియన్స్. కానీ భారీ అంచనాలు ఉండడం వల్ల, ఆ అంచనాలను అందుకోవడం లో ఈ చిత్రం విఫలం అయ్యింది. ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ చిత్రం తమిళనాడు లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. మళ్ళీ ఈ రేంజ్ అంచనాలతో రజనీకాంత్ సినిమా విడుదల అవ్వడం కష్టమే అని అంతా అనుకున్నారు.
కానీ అగష్టు 14 న విడుదల అవ్వబోతున్న ‘కూలీ'(Coolie Movie) చిత్రం కబాలి కి మించిన అంచనాలతో వస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకు బిజినెస్ ఆ రేంజ్ లో జరుగుతుంది మరీ. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాని మినిమం గ్యారంటీ (MG) బేసిస్ మీద బిజినెస్ చేస్తున్నారు. అంటే అనుకున్న రేట్ ని సినిమా కలెక్షన్ల రూపం లో కచ్చితంగా అందుకోవాలి. లేకపోతే ఒక్క రూపాయి కూడా బయ్యర్ కి రాదు, మొత్తం పోయినట్టే. అలా MG బేసిస్ మీద ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ని 90 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట. అంటే ఓవర్సీస్ లో 90 కోట్ల షేర్ మార్కెట్ అంటే కచ్చితంగా 180 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రావాలి. అంతకు మించి ఒక్క రూపాయి తక్కువ వచ్చినా మొత్తం పోతుంది. ఈ రేంజ్ రిస్క్ కి సిద్ధమయ్యారు అక్కడి బయ్యర్స్. దీనిని బట్టి ఈ చిత్రం పై హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కేవలం ఓవర్సీస్ లో మాత్రమే కాదు, డొమెస్టిక్ మార్కెట్ లో కూడా ఈ సినిమాకు మార్కెట్ లో ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. తెలుగు రాష్ట్రాల్లో 40 నుండి 50 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం లో విలన్ గా నటించిన అక్కినేని నాగార్జున నే తెలుగు వెర్షన్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా క్రేజ్ ఈ విధంగా ఉంటే మరోవైపు ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి నటించిన ‘వార్ 2′(War 2 Movie) పై ఆడియన్స్ లో కనీస స్థాయిలో బజ్ లేదు. ఇలాగే కొనసాగితే కచ్చితంగా ఈ చిత్రం ‘కూలీ’ ముందు దారుణంగా దెబ్బ తినే అవకాశం ఉంది. చూడాలి మరి ఎండి జరగబోతుంది అనేది.