Coolie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు (Nageshwara rao) కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున (Nagarjuna) చాలా తక్కువ సమయంలోనే యువ సామ్రాట్ గా, కింగ్ గా తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. నాగార్జున చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పిస్తూ వస్తున్నాయి. రెగ్యూలర్ సినిమాలనే కాకుండా ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడంలో కూడా నాగార్జున మొదటి నుంచి ఆసక్తి చూపిస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని డిఫరెంట్ జానర్స్ లో ఉండడం దానికి కారణం అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన రజనీకాంత్ హీరోగా చేస్తున్న ‘కూలీ’ (Cooli) సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. లోకేష్ కనకరాజు (లోకేష్ Kanakraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున పాత్ర చాలా కీలకంగా మారబోతుందట.
ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ ని రిలీజ్ చేశారు. ఒక్క బ్యాక్ షాట్ తోనే నాగార్జున చాలా పాపులారిటిని సంపాదించుకున్నాడు. ఇక గీతాంజలి, రక్షకుడు తర్వాత నాగార్జునకు తమిళంలో కూడా చాలా మంచి ఆదరణ దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ సాధిస్తే నాగార్జునకి భారీ గుర్తింపు వస్తుంది.
Also Read : ‘కూలీ’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని భారీ రేట్ కి కొనుగోలు చేసిన నాగార్జున!
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నాగార్జున చక్రం తిప్పడం పక్కా అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. నాగార్జున లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరెవరు లేరు అంటూ కొంతమంది విమర్శకులు సైతం చెబుతూ ఉండడం విశేషం. ఇండస్ట్రీలో ఎవరు చేయనటువంటి వైవిద్య భరితమైన పాత్రలను చేసి మెప్పించిన నటుడిగా ఆయనకు చాలా మంచి గుర్తింపైతే ఉంది…
ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సైతం తన హవాని కొనసాగించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా సినిమా ఎలా ఉంటుంది? నాగార్జునకు ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుంది? అనేది తెలియాలంటే ఆగస్ట్ 14 వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమా సక్సెస్ అనేది రజినీకాంత్ కి కూడా చాలా కీలకంగా మారబోతోంది…