War 2 : జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఎప్పుడైతే నందమూరి ఫ్యామిలీ నుంచి తను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచే ప్రేక్షకుల్లో తన మీద ఒక మంచి అభిప్రాయం అయితే ఏర్పడింది. ఇక నందమూరి తారకరామారావు గారి రూపురేఖలు అతనిలో కనిపించడం తాతకు తగ్గ మనవడి గా ఎదగడం అతని వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని మరి సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ ఉండడం ఇవన్నీ అతనికి చాలా బాగా కలిసి వచ్చాయనే చెప్పాలి. ఇక తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ తీసుకున్న విధానం కూడా చాలా బాగుంది. ప్రేక్షకులు సైతం జూనియర్ ఎన్టీఆర్ మీద సాఫ్ట్ కార్నర్ తో ఉంటారు. అలాగే అతని సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ (Hruthik Roshan) తో కలిసి ఆయన చేస్తున్న వార్ 2 (War 2) సినిమా అతనికి గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంతసేపు కనిపిస్తుంది. స్క్రీన్ మీద ఆయన ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేయబోతున్నాడు అనే దానిమీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వార్ 2 సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ అయితే ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఇక హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ ని తలపిస్తూ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం భారీ కాన్ఫిడెంట్ తో ఉన్నారట.
Also Read : వార్ 2 మూవీ రిలీజ్ తర్వాత జరిగేది ఇదేనా..?
మరి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఈ సినిమాలో ఒక 20 నిమిషాల పాటు మాత్రమే కనిపిస్తాడని ఆయన కనిపించినప్పుడు స్క్రీన్ మొత్తం అల్లాడిపోతుందని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
హృతిక్ రోషన్ తో పాటు పోటీపడి నటించడమే కాకుండా కొన్ని సీన్స్ లో అతన్ని డామినేట్ కూడా చేశాడంటూ ఎన్టీఆర్ మీద కొన్ని ప్రశంసలైతే దక్కుతున్నాయి. మరి ఏది ఏమైనా ఈ సినిమాలో ఎవరి డామినేషన్ ఎక్కువగా ఉంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…