Coolie Nagarjuna Villain Role: సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) ఈ నెల 14 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుండడం తో ఆ చిత్ర మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీ గా ఉన్నారు. రీసెంట్ గానే చెన్నై లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి రజనీకాంత్ తో పాటు, సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు హాజరయ్యారు. నేడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. కానీ రజనీకాంత్ మాత్రం ఈ ఈవెంట్ కి రాలేకపోయాడు. కానీ ఆయన తెలుగు ఆడియన్స్ కోసం ఒక వీడియో బైట్ ని విడుదల చేశాడు. ఈ వీడియో బైట్ లో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read: ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడం చాలా కష్టం..భయపడ్డాను – హృతిక్ రోషన్
రజనీకాంత్ మాట్లాడుతూ ‘తెలుగు సినిమా ప్రేక్షకులకు నా నమస్కారం. నేను సినీ ఇండస్ట్రీ కి వచ్చి 50 ఏళ్ళు అయ్యింది, ఇది నా డైమండ్ జూబ్లీ సంవత్సరం. ఈ సంవత్సరం లో కూలీ చిత్రం విడుదల అవుతుండడం విశేషం. సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మించిన ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహించాడు. అనిరుద్(Anirudh Ravichander) ఈ చిత్రానికి సంగీతం అందించాడు, ఆగష్టు 14 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. తెలుగు లో రాజమౌళి ఎలాగో, లోకేష్ కనకరాజ్ మా ఇండస్ట్రీ లో అలా అన్నమాట. ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు ఆయనది ఫ్లాప్ అవ్వలేదు. అలాంటి డైరెక్టర్ తో కలిసి నేను పనిచేశాను. ఈ చిత్రంలో ఇంకో గొప్ప విషయం ఏమిటంటే స్టార్ క్యాస్టింగ్. చాలా ఏళ్ళ తర్వాత నేను సత్యరాజ్ తో కలిసి చేస్తున్నాను. శృతి హాసన్ తో కూడా ఇదే నా మొదటి సినిమా’.
Also Read: ఈ ఏడాది వచ్చే సినిమాల్లో దేనికోసం వెయిటింగ్.. దేనికి హైప్ ఉంది..?
‘కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర(upendra) ఎలాంటి నటుడు అనేది మీ అందరికీ తెలుసు, ఆయన కూడా ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించాడు. మలయాళం నటుడు సౌబిన్, అదే విధంగా దోహా అనే క్యారక్టర్ లో అమీర్ ఖాన్(Amir Khan) మొట్టమొదటిసారి సౌత్ ఇండియన్ ఫిల్మ్ లో స్పెషల్ రోల్ చేసాడు. ఆయన కెరీర్ లోనే స్పెషల్ రోల్ చేయడం ఇదే తొలిసారి. ఇక ఈ సినిమాకు అతి పెద్ద అట్రాక్షన్ ఏమిటంటే, కింగ్..మన నాగార్జున(Akkineni Nagarjuna) గారు దీంట్లో విలన్ క్యారక్టర్ చేశారు. ఈ సబ్జెక్టు వినగానే నాకు ఆ సైమన్ క్యారక్టర్ ని నేనే చేసేంత ఆశపడ్డాను. నాకు ఎప్పుడూ విలన్ క్యారెక్టర్స్ చేయడమంటే ఇష్టం, నేను అక్కడి నుండి వచ్చిన వాడినే కాబట్టి. ఆ క్యారక్టర్ ఎవరు చేస్తారు అనేది నాకు ఆసక్తిగా ఎదురు చూసాను. ఆ క్యారక్టర్ కోసం లోకేష్ ఆరు నెలల పాటు అన్వేషించాడు. ఒకరోజు నాకు గుడ్ న్యూస్ సార్ అన్నాడు. ఏమిటది అని అడిగితే, నాగార్జున గారు మన సినిమాలో విలన్ క్యారక్టర్ చేస్తున్నాడు అని చెప్పాడు. నేను షాక్ అయ్యాను, ఆయన ఒప్పుకున్నాడా అని, చాలా అద్భుతంగా చేశాడు. బాషా సినిమాలో ఆంటోని అనే విలన్ క్యారక్టర్ ఎలా హైలైట్ అయ్యిందో, కూలీ లో సైమన్ క్యారక్టర్ అలా హైలైట్ అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.
Superstar Rajinikanth’s super speech for #Coolie (Telugu) Pre-Release Event ⚡#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges… pic.twitter.com/l0zc6OAwTw
— Sun Pictures (@sunpictures) August 4, 2025