Kiran Abbavaram Son Name: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) గత ఏడాది ఆగష్టు నెలలో తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్ళై ఏడాది కూడా కాకముందే ఈ క్యూట్ కపుల్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం స్వయంగా కొంతకాలం క్రితం అభిమానులతో పంచుకున్నాడు. నేడు ఈ జంట తన బిడ్డతో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లారు. ఈ శుభ సందర్భంగా తమ కొడుక్కి ‘హను’ అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ తమ బిడ్డ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. చూసేందుకు ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ బుడ్డోడు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది.
Also Read: పూరి – విజయ్ సేతుపతి మూవీ లో గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో…
సాధారణంగా సెలబ్రిటీలు చిన్న పిల్లలకు దిష్టి తగులుతుంది అనే ఉద్దేశ్యంతో అప్పుడే పుట్టిన తమ పిల్లల ఫోటోలను పబ్లిక్ చేయడానికి ఇష్టపడరు. కానీ కిరణ్ అబ్బవరం దంపతులు అతి తక్కువ సమయం లోనే తమ కొడుకు ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ‘హను’ అనే పేరు చాలా బాగుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మన టాలీవుడ్ లో హను రాఘవపూడి పేరుతో ఒక డైరెక్టర్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన పేరే ఇతనికి పెట్టావంటే, ఆ డైరెక్టర్ మీద నీకు ఎంత ప్రేమనే అంటూ అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇంత వేగంగా బిడ్డకు జన్మనిచ్చిన అతి తక్కువ మంది సెలబ్రిటీలతో ఈ క్యూట్ కపుల్ ఒకరు అనొచ్చు. బుడ్డోడి ముఖం చూస్తుంటే అచ్చు గుద్దినట్టు వాళ్ళ అమ్మలాగానే ఉన్నాడని అంటున్నారు నెటిజెన్స్.
Also Read: ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడం చాలా కష్టం..భయపడ్డాను – హృతిక్ రోషన్
ఇక కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే, వరుస ఫ్లాప్స్ లో ఉన్న ఆయనకు ‘క’ అనే చిత్రం కమర్షియల్ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇలాంటి సినిమాలే కిరణ్ అబ్బవరం చెయ్యాలని అంతా అనుకున్నారు. పెళ్లి తర్వాత మనోడికి బాగా కలిసొచ్చింది అని అందరూ అప్పట్లో కామెంట్స్ కూడా చేశారు. కానీ ఈ చిత్రం తర్వాత వచ్చిన ‘దిల్ రూబా’ అనే చిత్రం మాత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఆయన చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా గ్లింప్స్ వీడియో ని విడుదల చేయగా , ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.