Coolie Movie Status: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో, తెలుగు ఆడియన్స్ కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ ద్వారా ఇప్పటికే ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనేది అందరికీ ఒక అంచనా వచ్చేసి ఉంటుంది. ఈసారి లోకేష్ కనకరాజ్ కంటెంట్ మీదనే సినిమాని నడిపించినట్టుగా అనిపిస్తుంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరియు ఇంటర్వ్యూస్ లో లోకేష్ కనకరాజ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘మీరు అసలు కలలో కూడా ఊహించని సర్ప్రైజ్ లు ఈ సినిమాలో ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చారు. అందులో ఒక సర్ప్రైజ్ లీక్ అయిపోయింది. ట్రైలర్ చివర్లో రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ ని ఒక చిన్న షాట్ లో చూపిస్తారు గుర్తుందా?.
ఈ షాట్ లో కనిపించేది వింటేజ్ రజనీకాంత్ కాదట, ప్రముఖ యంగ్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) ఈ క్యారక్టర్ చేశాడట. ఫ్లాష్ బ్యాక్ లో రజనీకాంత్ మాస్ వేరే లెవెల్లో ఉంటుందని, ఆ క్యారక్టర్ ని శివ కార్తికేయన్ తో చేయించారని చిన్న లీక్ ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా ఇంటర్వ్యూస్ లో ఫ్లాష్ బ్యాక్ విషయం లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు ఎవ్వరూ చెయ్యని ప్రయత్నం తాను ఫ్లాష్ బ్యాక్ లో చేశానని, కచ్చితంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి ఆడియన్స్ థ్రిల్ అవుతారని చెప్పుకొచ్చాడు. మాములుగా రజినీకాంత్ కి యంగ్ గెటప్ వేసి ఈ క్యారక్టర్ ని చేయించి ఉండుంటే లోకేష్ ఇలా మాట్లాడేవాడు కాదు. కానీ ఇలా స్పెషల్ గా చెప్పాడంటే కచ్చితంగా శివ కార్తికేయన్ చేతనే ఆ క్యారక్టర్ ని చేయించి ఉంటాడు.
ఇది నిజంగా చాలా డేరింగ్ ప్రయోగం. క్లిక్ అయితే వేరే లెవెల్ కి వెళ్తుంది. పొరపాటున మిస్ ఫైర్ అయితే మాత్రం సినిమా మీద ఘోరమైన ప్రభావం పడే అవకాశం ఉంది. అదే జరిగితే వీకెండ్ తర్వాత సినిమా సర్దేయడమే. చూడాలి మరి లోకేష్ కనకరాజ్ ఆ సన్నివేశాన్ని ఎలా మలిచాడో, ఆడియన్స్ దానిని ఎలా తీసుకుంటారో అనేది. ఇకపోతే ఈ చిత్రం లో అక్కినేని నాగార్జున విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆయన క్యారక్టర్ కూడా అద్భుతంగా వచ్చిందట. ఏళ్ళ తరబడి ఆ క్యారక్టర్ గురించి మాట్లాడుకునేలా ఉంటుందట. ఆ రేంజ్ లో నిజంగా ఆ క్యారక్టర్ వచ్చి ఉండుంటే నాగార్జున పాన్ ఇండియా లెవెల్ లో ఇలాంటి క్యారెక్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోవచ్చు.