Hair regrowth Treatment: దైనందిన జీవితంలో ఆరోగ్యం కూడా ముఖ్యమే. అయితే వాతావరణ కలుషితంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఒక్కోసారి ఎంత నాణ్యమైన ఆహారం తీసుకున్నా.. వాటిలో ఉండే రసాయనాల వల్ల కొత్త సమస్యలు వస్తున్నాయి. పట్టణాల్లో ఉండే వాటర్ పొల్యూషన్ తో చాలామందికి హెయిర్ ఫాల్స్ సమస్య ఉంది. కొందరు చిన్న వయసులోనే బట్టతల వచ్చి ఇబ్బంది పెడుతుంది. ఇంకా పెళ్లి కాకముందు ఈ సమస్య ఉంటే వారు మరింత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. దీంతో బట్టతల నుంచి జుట్టు రావడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. అతనికి ఉన్న జుట్టు పోగా.. లక్ష రూపాయల డబ్బు లాక్కున్నారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ చెందిన ఓ వ్యక్తి జుట్టు రావడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇంతలో ఒక సంస్థ నుంచి తనకు జుట్టు తెప్పిస్తారని సమాచారం అందింది. దీంతో ఆశ పడ్డ అతడు ఆ సంస్థ ప్రతినిధులను ఆశ్రయించాడు. అయితే వారు ఈయన అవసరాన్ని గుర్తించి.. లక్ష రూపాయల వరకు దోసుకున్నారు. ముందుగా ఎలాంటి ఫీజు చెల్లించకుండానే జుట్టు తెప్పిస్తామని చెప్పారు. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. దీంతో ఆశపడ్డ అతను సరేనని చెప్పాడు.
అయితే ట్రీట్మెంట్ మొదలు పెట్టిన తర్వాత తన చేత బజాజ్ ఫైనాన్స్ నుంచి లోన్ తీయించారు. అయితే ఈ లోన్ ద్వారా డబ్బులు చెల్లిస్తే చాలని చెప్పారు. ఇక నమ్మిన ఆ వ్యక్తి ట్రీట్మెంట్ పూర్తి చేసుకున్నాడు. అయితే ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత అతనికి జుట్టు రాకపోగా.. ఉన్న జుట్టు ఊడిపోయింది. అయితే ఆ తర్వాత ఇదేంటని అడిగితే.. తనకు డయాబెటిక్ సమస్య ఉందని.. అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ చెబుతున్నారు. ఇలా ఏదో ఒకటి చెబుతూ కాలం దాటవేస్తున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు ఆ వ్యక్తి రెడీ అయ్యాడు. కాకినాడకు చెందిన ఓ సంస్థలో ఈయన మోసపోయినట్లు ఆవేదన చెందుతున్నాడు.
అయితే చాలామందికి జుట్టు సమస్య చిన్నప్పటి నుంచే ఉంది. ఇందుకోసం రకరకాల ప్రకటనలు చూసి మోసపోతున్నారు. ఇందులో బాగా కొందరు లక్షల రూపాయలు వృధా చేసుకుంటున్నారు. ఇటువంటి ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా సంస్థ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు పోవాలని అంటున్నారు. ఒక్కోసారి ఇలాంటి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.