Coolie Movie : 7 పదుల వయస్సు దాటినా సౌత్ ఇండియా లో రజినీకాంత్(Superstar Rajinikanth) పనిచేస్తున్నంత యాక్టీవ్ గా కుర్ర హీరోలు కూడా పనిచేయడం లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిన్న గాక మొన్న కూలీ(Coolie Movie) మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు అనే వార్త వచ్చింది, అప్పుడే షూటింగ్ కార్యక్రమాలు కూడా అయిపోయాయి. అతి త్వరలోనే ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraj) దర్శత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కోసం కేవలం రజినీకాంత్ అభిమానులు మాత్రమే కాదు, కోలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే కోలీవుడ్ కి ఇప్పటి వరకు ఒక్క వెయ్యి కోట్ల సినిమా కూడా లేదు. ‘కూలీ’ చిత్రం కచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరుతుందని బలమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉన్నాయి.
Also Read : పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అయితే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందేనా..?
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 40 కోట్ల రూపాయలకు జరిగినట్టు తెలుస్తుంది. అదే విధంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ కు దాదాపుగా 125 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట. సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, హిందీ థియేట్రికల్ రైట్స్ ఇలా అన్ని కలిపి మరో 200 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక తమిళ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది టాక్. అలా ఓవరాల్ గా ఈ చిత్రానికి దాదాపుగా 750 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగిందట. తమిళ్ లో ఇది ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుగా చెప్తున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. తెలుగు లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని నాగవంశీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ‘జైలర్’ తర్వాత రజినీకాంత్ చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో థియేట్రికల్ రన్ ని దక్కించుకోలేకపోయాయి.
అయినప్పటికీ ఈ రేంజ్ బిజినెస్ జరగడం సాధారణమైన విషయం కాదు. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా, స్పెషల్ ఐటెం సాంగ్ లో పూజ హెగ్డే కనిపించనుంది. అలాగే మన టాలీవుడ్ నుండి కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ఇందులో ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ చేశాడు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా ఇందులో కీలకమైన క్యారక్టర్ చేశాడు. ఇక క్లైమాక్స్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని, ఇలా సినిమా మొత్తం స్టార్స్ తో నిండిపోయి ఉంటుందని, వెయ్యి కోట్లు కాదు, రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు తమిళ ట్రేడ్ పండితులు. ఇలాంటి చిత్రాలకు యావరేజ్ రేంజ్ టాక్ వచ్చినా వేరే లెవెల్ వసూళ్లు రావడాన్ని ఇది వరకు మనం చాలాసార్లు చూసాము. ఈ చిత్రానికి కూడా అదే రేంజ్ వసూళ్లు వస్తాయి.