OG Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన స్టార్ డమ్ భారీగా విస్తరించింది. ఇక సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా కూడా ఆయన రాణిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక సుజీత్ (Sujith) డైరెక్షన్ లో ఆయన చేస్తున్న ఓజీ (OG) సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమా కనక రిలీజ్ అయితే ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి అంటూ సుజిత్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ ను సాధించబోతున్నాడు అనే విషయాలైతే చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. కానీ ఆయన రాజకీయంగా ఇప్పుడు రాణించాలని చూస్తున్నాడు. అందువల్ల ఇక మీదట సినిమాల మీద పెద్దగా ఫోకస్ చేసే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే మాత్రం తన అభిమానుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి.
Also Read : ‘విశ్వంభర’ అసలు రిలీజ్ అవుతుందా లేదా..? అసలు ఏమి జరుగుతుంది!
ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఓజీ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంది అంటూ పవన్ కళ్యాణ్ ఒకానొక సందర్భంలో తెలియజేయడం విశేషం. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ను చూస్తే మనకు ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఊచకోత కోయబోతున్నట్టుగా తెలుస్తోంది.
తన పర్ఫామెన్స్ తో పాటు యావత్ ప్రేక్షకులందరిని మెప్పించడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిమీద సరైన క్లారిటీ లేదు. కానీ సినిమా రిలీజ్ అయితే మాత్రం ఇంతకుముందు ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టిస్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ప్రస్తుతానికి తెలుగుకు మాత్రమే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాన్ ఇండియాలో ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu) మూవీని కూడా ఫినిష్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : సుకుమార్ ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన మరో సినిమా ఎందుకు కాన్సిల్ అయింది..