Coolie break even Collections: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ట్రేడ్ ని తీవ్రంగా నిరాశపరిచిన చిత్రాల్లో ఒకటి ‘కూలీ'(Coolie Movie). సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరో గా నటించిన ఈ సినిమాకు మొదటి రోజు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. కానీ మొదటి నుండి ఈ సినిమాపై భారీ హైప్ ఉన్న కారణంగా బంపర్ ఓపెనింగ్ దక్కింది. ఆ తర్వాత వీకెండ్ కూడా భారీ వసూళ్లనే సొంతం చేసుకుంది కానీ,మామూలు వర్కింగ్ డేస్ లో మాత్రం బాగా డౌన్ అయిపోయింది. అంత డౌన్ అయిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు, లోకేష్ కనకరాజ్ గత చిత్రం లియో కి కూడా ఇలాంటి టాక్ నే వచ్చింది, కానీ ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ‘కూలీ’ చిత్రాన్ని ఏ యాంగిల్ లో చూసినా ‘లియో’ కంటే మంచి సినిమానే. కాబట్టి ఈ సినిమా ఫుల్ రన్ లో సక్సెస్ అయిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు భావించారు.
కానీ వారి అంచనాలు మొత్తం తప్పు అయ్యాయి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అయితే వచ్చాయి కానీ, అవి బ్రేక్ ఈవెన్ మార్కుకి ఏ మాత్రం సరిపోవు. తమిళనాడు లో అయితే ఈ చిత్రం అతి పెద్ద డిజాస్టర్ గా నిల్చింది. ఈ ఏడాది విడుదలైన అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం వసూళ్లను కూడా ఈ సినిమా తమిళనాడు లో దాటలేకపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 43 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. అదే విధంగా కర్ణాటక లో 45 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, హిందీ+ రెస్ట్ ఆఫ్ ఇండియా లో 49 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో 179 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 512 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకు హిందీ వెర్షన్ లో తప్ప, ఎక్కడ గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు కనిపించడం లేదు. బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ చిత్రం అందుకోవాలంటే ఇంకా 88 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. అది దాదాపుగా అసాధ్యం అనే అనుకోవాలి. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న సెంటర్ ఏదైనా ఉందా అంటే అది నార్త్ ఇండియా మార్కెట్ అయినటువంటి హిందీ వెర్షన్ వసూళ్లే అని చెప్పొచ్చు. హిందీ లో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో. తెలుగు లో యావరేజ్ అనుకోవచ్చు.