Pawan Kalyan New Movies Details: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా(Deputy CM Pawan Kalyan) బాధ్యతలు చేపడుతూ ఫుల్ బిజీ గా గడుపుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన చేతిలో ఉన్నటువంటి మూడు సినిమాలను పూర్తి చేసి ఇక పరిపాలనపై ఫుల్ ఫోకస్ పెడతాడని అంతా అనుకున్నారు. ‘హరి హరి వీరమల్లు’ మూవీ ప్రొమోషన్స్ సమయంలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కూడా ఇదే చెప్పుకొచ్చాడు. ‘హరి హర వీరమల్లు’ విడుదలైపోయింది. ఈ నెల 25న ఓజీ(They Call Him OG) చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలు కాకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) సినిమాని కూడా ఆయన పూర్తి చేసేసాడు. కేవలం ఒకే ఒక్క పాట షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. ఈ నెల 7వ తేదీ నుండి ఆ పాట చిత్రీకరణ మొదలు కానుంది. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి సంబంధించి పవన్ కళ్యాణ్ షూటింగ్ వరకు పూర్తి అవుతుందట.
ఇదే ఆయన ఆఖరి చిత్రమని అభిమానులు బలంగా ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ సినిమాతో ఆయన ఆపడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే కన్నడ నిర్మాత KVN కి పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయడానికి డేట్స్ ఇచ్చాడు. ఈ చిత్రం తో పాటు దిల్ రాజు వద్ద కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక 30 రోజుల డేట్స్ ఉన్నాయట. అదే విధంగా వీరమల్లు నిర్మాత AM రత్నం వద్ద కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి 30 రోజుల డేట్స్ ఉన్నాయట. వీళ్లిద్దరికీ సపరేట్ గా సినిమా చేయడం లేదు కానీ, వాళ్లిద్దరూ సంయుక్తంగా కలిసి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాని నిర్మించబోతున్నారు అట. వీళ్ళతో పాటు SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కూడా ఆయన ఒక సినిమా చేయనున్నాడు. డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. ఈ మూడు ప్రాజెక్ట్స్ ని వచ్చే ఏడాది లో పవన్ కళ్యాణ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
దిల్ రాజు తో చేయబోయే సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి, ఆ చిత్రం పూర్తి అవ్వగానే ఈ సినిమాకు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా KVN ప్రొడక్షన్స్ తో చేయబోయే సినిమాకు తమిళ టాప్ డైరెక్టర్ ఖరారు అయ్యాడట. లోకేష్ కనకరాజ్,H వినోద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక SRT ఎంటర్టైన్మెంట్స్ మీద చేయబోయే సినిమాకు సురేందర్ రెడ్డి డైరెక్టర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అట్టకెక్కింది, ఆ సినిమాకు బదులుగా వేరే సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా వచ్చే ఏడాది కూడా పవన్ కళ్యాణ్ సినిమాలతో ఫుల్ బిజీ కానున్నాడు.