Coolie 6th Day Collections: సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) ఎలాంటి అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలైందో మన అందరికీ తెలిసిందే. నేటి తరం యూత్ ఆడియన్స్ అమితంగా ఇష్టపడే లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి డైరెక్టర్ అవ్వడం, అనిరుద్ అద్భుతమైన సంగీతం, స్టార్ క్యాస్టింగ్ కారణంగా కనీవినీ ఎరుగని రేంజ్ హైప్ ఈ చిత్రానికి విడుదలకు ముందు ఏర్పడింది. కానీ సినిమా ఆ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం తో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. సినిమా పూర్తిగా బాగాలేదా అంటే అసలు కాదు, సినిమా బాగానే ఉంది, కానీ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) స్టాండర్డ్ కి తగ్గట్టుగా లేదంతే. కానీ బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రం మొదటి వీకెండ్ ఈ చిత్రానికి భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. కేవలం వీకెండ్ లోనే ఈ చిత్రానికి 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
Also Read: బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’కు ఎండ్ కార్డ్.. ఊహించని ట్విస్ట్.. ఏం జరిగిందంటే?
సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోవడం చాలా తేలిక అనుకున్నారు కానీ, వర్కింగ్ డేస్ లో వసూళ్లు భారీగా పడిపోయాయి. సోమవారం రోజున భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, మంగళవారం రోజున, అనగా నిన్న (6 వ రోజు) మరికొంత డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 6వ రోజున తెలుగు రాష్ట్రాల అనుండి కోటి రూపాయిల కంటే తక్కువ షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 6 రోజులకు కలిపి ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇక కేవలం 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే రావాలి. ఈ వీకెండ్ తో ఆ బ్రేక్ ఈవెన్ మార్కు ని చాలా తేలికగా అందుకోబోతుంది ఈ చిత్రం.
Also Read: ఎన్టీఆర్ ‘దేవర 2’ ఆగిపోవడం పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..ఇది మామూలు ట్విస్ట్ కాదు!
ఓవరాల్ గా 6వ రోజున ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. థియేట్రికల్ గ్రాస్ 445 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. ఈ వీకెండ్ భారీ వసూళ్లను నమోదు చేసుకోగలిగితే ఈ చిత్రం 500 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అవలీలగా అందుకుంటుంది. ఫుల్ రన్ లో 600 కోట్ల మార్కుని అందుకోవడం అయితే అసాధ్యం అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ఈ చిత్రం 530 కోట్ల రూపాయలకు క్లోజ్ అవుతుంది. కానీ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 600 కోట్ల రూపాయిల గ్రాస్ ని తప్పనిసరి పరిస్థితిలో అందుకోవాలి. కమర్షియల్ గా ఈ చిత్రం యావరేజ్ రేంజ్ నుండి ఎబోవ్ యావరేజ్ రేంజ్ కి స్థిరపడేలా ఉంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సెకండ్ హాఫ్ ని బలంగా డీల్ చేసి ఉండుంటే కోలీవుడ్ కి వెయ్యి కోట్ల గ్రాస్ కల నెరవేరేది, బ్యాడ్ లక్ పాపం.