East Godavari Rave Party News: ఈస్ట్ గోదావరి జిల్లాలో రే*వ్ పార్టీ అదుపుతప్పి పోలీసుల బారిన పడింది. నల్లజర్ల మండలం ఘంటవారిగూడెం ప్రాంతంలో జనసేన నాయకుడు వెజ్జే సుబ్బారావు జన్మదిన వేడుకల పేరుతో రాత్రంతా అసాంఘిక కార్యకలాపాలు సాగినట్టు పోలీసులు గుర్తించారు.
ఈస్ట్ గోదావరి జిల్లాలో రే*వ్ పార్టీ అదుపుతప్పి పోలీసుల బారిన పడింది. నల్లజర్ల మండలం ఘంటవారిగూడెం ప్రాంతంలో జనసేన నాయకుడు వెజ్జే సుబ్బారావు జన్మదిన వేడుకల పేరుతో రాత్రంతా అసాంఘిక కార్యకలాపాలు సాగినట్టు పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు రాత్రి దాడి చేసి 23 మంది యువకులు, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీ సమయంలో యువతులతో అశ్లీల నృత్యాలు, మద్యం విందు, హంగామా సాగిందని స్థానికులు చెబుతున్నారు.
దాడిలో పోలీసులు పలు కార్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 26 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయ నాయకుడి జన్మదిన వేడుక పేరుతో ఇలాంటి రేవ్ పార్టీ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: రేవ్ పార్టీ కేసులో ఎంటరైన ఏపీ నేతలు!
స్థానిక ప్రజలు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.