spot_img
Homeఎంటర్టైన్మెంట్Cooku With Jathi Ratnalu 2 contestants eliminated: 'కూకూ విత్ జాతిరత్నాలు 2' నుండి...

Cooku With Jathi Ratnalu 2 contestants eliminated: ‘కూకూ విత్ జాతిరత్నాలు 2’ నుండి ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ అవుట్.. ఇది ఎవ్వరూ ఊహించనిది..

Cooku With Jathi Ratnalu 2 contestants eliminated: స్టార్ మా ఛానల్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షోస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ఉన్న షోస్ అన్నీ ఈ ఛానల్ లోనే ఉన్నాయి. రీసెంట్ గానే ‘కూకూ విత్ జాతి రత్నాలు 2’ అనే గేమ్ షో మొదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది మొదటి సీజన్ బంపర్ హిట్ అవ్వడంతో ఈ ఏడాది ఈ షో కి రెండవ సీజన్ ని గ్రాండ్ గా మొదలు పెట్టారు. ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ బిగ్గెస్ట్ కుకింగ్ రియాలిటీ షోకి 4.8 టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయి. ఇది మామూలు రేంజ్ రేటింగ్ కాదు అనే చెప్పాలి. ఈ షోలో జాతి రత్నాలు గా మొదటి సీజన్ కి సంబంధించిన వాళ్ళే అత్యధిక శాతం ఉన్నారు.

అదే విధంగా కూక్స్ లో పాత సీజన్ నుండి తనూజ ని తీసుకొచ్చారు. మొదటి సీజన్ లో పాల్గొన్నప్పటికీ ఈమెని రెండవ సీజన్ కి తీసుకొని రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే, బిగ్ బాస్ సీజన్ 9 ద్వారా ఈమె సాధించిన క్రేజ్. అదే విధంగా సీజన్ 9 లో ఈమెతో పాటు కళ్యాణ్ పడాల కూడా బాగా ఫేమస్ అయ్యాడు. ఈయన సీజన్ 9 టైటిల్ విన్నర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ సీజన్ లో తనూజ, కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ కి ఆడియన్స్ నుండి మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఒకరు విన్నర్ గా, మరొకరు రన్నర్ గా నిలిచారు. ఈ జంటకు విపరీతమైన క్రేజ్ ఉన్న కారణంగానే వీళ్ళిద్దరిని శనివారం ఎపిసోడ్ లో ప్లాన్ చేసి పెట్టారు. అయితే ఈ జంట ఇప్పుడు విడిపోయే సమయం వచ్చేసింది. అందుకు ముఖ్య కారణం కళ్యాణ్ పడాల ఎలిమినేట్ అవ్వడమే.

కళ్యాణ్ పడాల ని బిగ్ బాస్ షోలో చూసినంత కాలం ఆయన కుకింగ్ చేస్తూ కనిపించడం ఎప్పుడూ జరగలేదు. తనకు కుకింగ్ రాకపోయినా కూడా ఈ షో కోసం నేర్చుకొని వచ్చాడు. మొదటి రెండు వారాల్లో కూడా ఇతను అందరికంటే తక్కువ స్కోర్ చేశాడు . ఇప్పుడు కూడా తక్కువ మార్కులు రావడం వల్లే ‘కూక్ ఆఫ్’ రౌండ్ కి వచ్చి ఎలిమినేట్ అయ్యాడు. అయితే చాలా మంది ఇతను సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి. ఈ వారం శ్రీకాంత్ అయ్యంగార్ ఎలిమినేట్ అవుతాడట. రెండు వారాల తర్వాత కళ్యాణ్ ఎలిమినేట్ అవుతాడట. ఈ ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్స్ పూర్తి అయ్యింది. వీళ్లిద్దరు ఎలిమినేట్ అయ్యినట్టు సమాచారం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular