https://oktelugu.com/

ఆ ఛానల్ అంతు చూసేందుకు రెడీ అవుతున్న రియా చక్రవర్తి?

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ మృతి బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్లోని నెపోటిజమే కారణమని నెటిజన్లు విమర్శలు చేశారు. అయితే సుశాంత్ ది ఆత్మహత్య కాదని.. అతడి హత్య చేశారంటూ ఆయన అభిమానులు.. కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి కేసును దర్యాప్తును చేస్తున్నారు. Also Read: అమ్మాయిలూ జాగ్రత్త అన్న ఎన్టీఆర్.. ఎందుకంటే? సుశాంత్ మృతికి రియా చక్రవర్తి బాధ్యురాలు అవునో కాదోగానీ ఓ మీడియా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 / 03:17 PM IST
    Follow us on

    యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ మృతి బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్లోని నెపోటిజమే కారణమని నెటిజన్లు విమర్శలు చేశారు. అయితే సుశాంత్ ది ఆత్మహత్య కాదని.. అతడి హత్య చేశారంటూ ఆయన అభిమానులు.. కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి కేసును దర్యాప్తును చేస్తున్నారు.

    Also Read: అమ్మాయిలూ జాగ్రత్త అన్న ఎన్టీఆర్.. ఎందుకంటే?

    సుశాంత్ మృతికి రియా చక్రవర్తి బాధ్యురాలు అవునో కాదోగానీ ఓ మీడియా వర్గం మాత్రమే ఆమెను దోషిగా నిర్ధారించేసింది. ఈమేరకు ఆమెపై వ్యతిరేక కథనాలను ప్రసారం చేసింది. ముఖ్యంగా రిపబ్లిక్ టీవీ సుశాంత్ ఆత్మహత్య కేసులో రియాను టార్గెట్ చేస్తూ మూడు నెలలుగా కథనాలను ప్రసారం చేసింది. ఈ కేసుతో డ్రగ్స్ లింకులు వెలుగుచూడటంతో ఇందులోని రియా చక్రవర్తిని ఆ చానల్ టార్గెట్ చేసి చూపించింది.

    సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో కొందరు రియాపై వ్యతిరేకత వ్యక్తం చేసిన మాటవాస్తమే. అయితే రిపబ్లిక్ చానల్ రియాను టార్గెట్ చేసిన తీరును చూసి ఆమెను వ్యతిరేకించిన వారుసైతం రియాపై జాలిపడ్డారు. అంటే ఆమెపై ఎంత తీవ్రస్థాయిలో సదరు ఛానెల్ కథనాలను ప్రసారం చేసిందో అర్థం చేసుకోవచ్చు. కొద్దిరోజులు ఎన్సీబీ కస్టడీలో ఉన్న రియాకు ఎట్టకేలకు బెయిల్ దొరికింది.

    తాజాగా బెయిల్ పై వచ్చి రియా చక్రవర్తి తనను అబాసుపాలుచేసిన రిపబ్లిక్ టీవీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. సదరు ఛానల్ పై  పరువు నష్టం దావావేసేందుకు రెడీ అవుతోంది. ఇటీవల సుశాంత్ ది ఆత్మహత్యేనని ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించారు. ఈ విషయాన్ని సీబీఐ కూడా వెల్లడించిన సంగతి తెల్సిందే. వైద్యులు, సీబీఐ తెలిపిన వివరాల ప్రకారం ఆమెకు ఈ కేసులో కొంత ఉపశమనం లభించేలా కన్పిస్తోంది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ను కోల్పోతుందా?

    ఈనేపథ్యంలోనే రిపబ్లిక్ ఛానల్ గతంలో తనపై ప్రసారం చేసిన కథనాలను రియా సేకరించిందట. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో రియాపై విచారణ జరుగుతోంది. ఈకేసులోనూ రిపబ్లిక్ ఛానల్ తనను టార్గెట్ చేయడంతో రియా చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో సదరు ఛానల్ నోరు మూసించేలా రియా చక్రవర్తి న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. ఇకనైనా సదరు ఛానల్ రియాపై ప్రసారం చేస్తున్న నెగిటివ్ కథనాలను ఆపుతుందో లేదో వేచిచూడాల్సిందే..!