https://oktelugu.com/

Raashi Khanna: తిరుమలలో రాశీ ఖన్నా షాకింగ్ లుక్.. అలా ఎలా వెళ్ళింది ?

Raashi Khanna: బబ్లీ గర్ల్ ‘రాశీ ఖ‌న్నా’కి కాస్త తెలివి ఎ క్కువే. ‘మనం’లో చిన్న సైడ్ క్యారెక్టర్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా.. తన లౌక్యంతో తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్’ సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ తిరుమల స్వామి వారిని దర్శించుకుంది. తన ‘పక్కా కమర్షియల్’ మూవీ జూలై 1వ తేదీన విడుదల కానుందని.. అందుకే […]

Written By:
  • Shiva
  • , Updated On : June 29, 2022 / 04:09 PM IST
    Follow us on

    Raashi Khanna: బబ్లీ గర్ల్ ‘రాశీ ఖ‌న్నా’కి కాస్త తెలివి ఎ క్కువే. ‘మనం’లో చిన్న సైడ్ క్యారెక్టర్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా.. తన లౌక్యంతో తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్’ సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ తిరుమల స్వామి వారిని దర్శించుకుంది.

    Raashi Khanna

    తన ‘పక్కా కమర్షియల్’ మూవీ జూలై 1వ తేదీన విడుదల కానుందని.. అందుకే శ్రీవారి ఆశీర్వచనాలు కోసం వచ్చాను అని.. మా సినిమా విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించాను అని రాశీఖన్నా చెప్పుకొచ్చింది. అయితే రాశీ ఖన్నా తిరుమల పర్యటనలో చేసిన పనే ఇప్పుడు వైరల్ అవుతుంది.

    Also Read: NTR Sensational Decision: స్క్రిప్ట్ విషయం లో కొరటాల గందరగోళం..సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్

    Raashi Khanna

    చీర కట్టులో సాంప్రదాయంగా ‘రాశీ ఖ‌న్నా’ తిరుమలలో కనిపించింది. అయితే, ఆమె పూలు పెట్టుకోవడం వివాదాస్పదమవుతుంది. తిరుమలలో అడుగు పెట్టే ఏ భక్తురాలు లేదా భక్తుడు పూలు పెట్టుకోరాదనే నియమం ఉంది. కానీ ‘రాశీ ఖ‌న్నా’ పూలు పెట్టుకుని కనిపించింది.

    Raashi Khanna

    మరి ‘రాశీ ఖ‌న్నా’కి ఈ పూల నియమం తెలుసో లేదో. నిజానికి ఈ విషయాన్ని పదే పదే తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతూ ఉంటుంది. అయినా ‘రాశీ ఖ‌న్నా’ ఇలా పూలు పెట్టుకోవడంతో ఆమె పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

    Raashi Khanna

    బబ్లీ గర్ల్ ‘రాశీ ఖ‌న్నా’కి నటనలో పెద్దగా టాలెంట్ లేకపోవడంతో ఆమెకు ఈ మధ్య అవకాశాలు తగ్గాయి. తెలుగులో ఛాన్స్ లు లేవు అని గ్రహించిన వెంటనే తమిళంకి మకాం మార్చింది. ఇప్పుడు తమిళంలో వరుస అవకాశాలతో ఫుల్ డిమాండ్ తెచ్చుకుంది.

    కెరీర్ పడిపోయింది అనుకున్న ప్రతిసారి ‘రాశీ ఖ‌న్నా’ మళ్ళీ నిలబడగలుగుతుంది. కోలీవుడ్‌ లో ఇప్పటికే రాశీఖన్నా ‘అరణ్‌మణై 3’, విజయ్‌ సేతుపతి ‘తుగ్లక్‌ దర్బార్‌’ వంటి సినిమాలు చేస్తోంది.అలాగే కార్తీ ‘సర్దార్‌’ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తోంది.

    అయితే ఈ బోల్డ్ బ్యూటీకి మరో బంఫర్ ఆఫర్ తగిలింది. ధనుష్‌ హీరోగా మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్‌ గా రాశీఖన్నాని తీసుకుంటున్నారు. ధనుష్‌ చేస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సినిమాలో కూడా రాశీఖన్నా ఛాన్స్ కొట్టేసింది అంటే.. హీరోయిన్ గా రాశీఖన్నా స్థాయి పెరిగినట్టే.

    మొత్తానికి పెద్దగా టాలెంట్ లేకపోయినా హిట్లు లేకపోయినా చూస్తుండ‌గానే తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించేసుకుంది. అయితే ఇలా సడెన్ గా ఛాన్స్ లు పోటెత్తడానికి గల కారణం.. రెమ్యునిరేషన్ ను భారీగా తగ్గించడమేనట.

    Also Read:Pakka Commercial: పక్కా కమర్షియల్ మూవీ హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు వసూలు చెయ్యాలో తెలుసా?

    Tags