https://oktelugu.com/

New Heroes: ఆ కొత్త హీరోల మధ్య పోటీ.. ఎవరు గెలిచారు?

New Heroes: కరోనా పరిస్థితుల కారణంగా ఈసారి సంక్రాంతికి పెద్ద సినిమాలేవీ కూడా రిలీజు కాలేదు. టాలీవుడ్లో కింగ్ నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ మాత్రమే అగ్ర హీరో సినిమాగా రిలీజైంది. ఇది మినహా మిగిలిన సినిమాలన్నీ కూడా చిన్న సినిమాలే. వీటిలో మెగాస్టార్ చిరంజీవి అల్లు కల్యాణ్ దేవ్ నటించిన ‘సూపర్ మచ్చి’, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన ‘హీరో’, నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు అశిష్ నటించిన ‘రౌడీ బాయ్స్’ సినిమాలు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 17, 2022 / 04:16 PM IST
    Follow us on

    New Heroes: కరోనా పరిస్థితుల కారణంగా ఈసారి సంక్రాంతికి పెద్ద సినిమాలేవీ కూడా రిలీజు కాలేదు. టాలీవుడ్లో కింగ్ నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ మాత్రమే అగ్ర హీరో సినిమాగా రిలీజైంది. ఇది మినహా మిగిలిన సినిమాలన్నీ కూడా చిన్న సినిమాలే.

    వీటిలో మెగాస్టార్ చిరంజీవి అల్లు కల్యాణ్ దేవ్ నటించిన ‘సూపర్ మచ్చి’, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన ‘హీరో’, నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు అశిష్ నటించిన ‘రౌడీ బాయ్స్’ సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి.

    2022 సంక్రాంతి సినిమాగా ‘బంగార్రాజు’ నిలిచింది. ఆ తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రంగా ‘రౌడీ బాయ్స్’ నిలువగా ‘హీరో’ చిత్రం పర్వాలేదనిపించుకుంది. మరోవైపు ప్రేక్షకులు ‘సూపర్ మచ్చి’ని పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం.

    కొత్త హీరోలతో తెరకెక్కిన ‘రౌడీ బాయ్స్’, ‘హీరో’ చిత్రాల్లో చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ సినిమాలో నటించిన అనుపమ, నిధి అగర్వాల్ ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్లే. వీరిద్దరి కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

    ఈ ఇద్దరు కూడా కొత్త హీరోలకు లిప్ లాక్ లు ఇచ్చి తమ సినిమాలపై హైప్ పెంచారు. అయితే రౌడీ బాయ్స్ కాలేజీ బ్రాక్ డ్రాప్ లో తెరకెక్కడంతో యూత్ ఈ సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. దీంతో ‘హీరో’తో పోలిస్తే ‘రౌడీ బాయ్స్’ మంచి టాక్ తెచ్చుకుంది.

    ఇక వీరద్దరు కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టున్నారు. ఈ ఇద్దరిలోనూ ఈజ్ బాగుంది. డాన్సులు బాగా చేస్తున్నారు. మంచి కథలు ఎంచుకొని, ఎక్స్‌ప్రెష‌న్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటే వీరిద్దరికి మంచి భ‌విష్య‌త్తు ఉంటుందనే టాక్ విన్పిస్తోంది. మరీ వీరి ప్రయత్నం ఏమేరకు సక్సస్ అవుతుందో వేచిచూడాల్సిందే..!