Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి బుల్లితెర పై విపరీతమైన క్రేజ్ ఉంది. మహిళా ప్రేక్షకులు కూడా అతని అల్లరిని ఇష్టపడుతూ ఉంటారు. ఇక సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గత కొన్ని ఏళ్లుగా వస్తోన్న పుకార్ల పరంపర గురించి తెలిసిందే. మొత్తానికి అతనికి ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఇమేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్.

ఎలాగూ సుధీర్ పెళ్లి ఇప్పుడొక కామెడీతో కూడుకున్న మిస్టరీ కాబట్టి.. అతని పెళ్లి పైనే వరుసగా ఎపిసోడ్స్ ను చేస్తున్నారు. తాజాగా వచ్చిన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ప్రోమో అందరికీ షాక్ ఇచ్చింది. ‘సుధీర్ పెళ్లి చూపులు’ అంటూ ఒక చిన్న ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో సుధీర్ కోసం నలుగురు అమ్మాయిలు పోటీ పడుతున్నట్లు చూపించారు.
Also Read: టాలీవుడ్‌లో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌లు ఎవరో తెలుసా?
ఇక ఆ నలుగురు అమ్మాయిలు చెప్పిన డైలాగ్స్ కూడా ఓవర్ గా ఉన్నాయి. ‘పెళ్లి చూపులు అంటే నాకు సిగ్గేస్తోంది’ అని సుధీర్ అంటే.. ‘సిగ్గు నీకు కాదు., నీకు పెళ్లి చూపులు అంటే నాకు సిగ్గు వేస్తోంది’ అంటూ బుల్లెట్ భాస్కర్ పంచ్ వేశాడు.
ఇక ప్రోమోలో హైలైట్స్ విషయానికి వస్తే..
‘దిగు దిగు నాగ’ అనే సాంగ్ కి వర్ష చేసిన డ్యాన్స్ అదిరిపోయింది.
అలాగే ‘అంత ఇష్టం ఏందయ్యా నీకు నా మీద’ అనే సాంగ్ కి నలుగురి అమ్మాయిలతో సుధీర్ వేసిన స్టెప్స్ కూడా బాగా పేలాయి.
ఇక ప్రోమో చివర్లో.. ‘ఈ రోజు సుధీర్ అన్నయ్య ఫస్ట్ నైట్, మీ బ్లెస్సింగ్స్ కావాలి’ అంటూ ప్రోమోను ఎండ్ చేయడం కూడా బాగా ఆకట్టుకుంది.

ఏది ఏమైనా ఒక మెజీషియన్ గా మొదలైన సుధీర్ ప్రస్థానాన్ని జబర్దస్త్ షో మలుపు తిప్పింది. ఇప్పుడు సినిమాలు, రియాలిటీ షోలు, టీవీ కార్యక్రమాలతో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. పలు సినిమాల్లో హీరోగానూ నటిస్తున్నాడు.
అయితే, ఆ మధ్య సుధీర్-రష్మీలకు పెళ్లి అంటూ హోరెత్తించారు. ఆ తర్వాత వర్షతో పెళ్లి అన్నారు. ఇప్పుడు మరో నలుగురు అమ్మాయిలను పట్టుకొచ్చారు. టీవీ షోల కోసం పాపం సుధీర్ కు పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసేస్తోంది శ్రీదేవి డ్రామా కంపెనీ టీం.
Also Read: నేను సక్సెస్ ఫుల్ హీరోగా మారడానికి ఆమె కారణం – మెగాస్టార్
