Pawan Kalyan: 2018 అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు. 2019 చివర్లో పవన్ కొత్త చిత్రాలు ప్రకటించారు. ఫస్ట్ దర్శకుడు వేణు శ్రీరామ్ తో పింక్ రీమేక్ వకీల్ సాబ్ చిత్ర ప్రకటన చేశారు. అనంతరం దర్శకుడు క్రిష్ తో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్ర ప్రకటన చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు సురేంధర్ రెడ్డి డైరెక్టర్ లో తన 29వ చిత్ర ప్రకటన చేశారు.

అయితే వీటన్నిటికంటే లేటుగా ప్రకటించిన అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ భీమ్లా నాయక్ త్వరత్వరగా పూర్తి చేశాడు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ త్రివిక్రమ్ కి అత్యంత సన్నిహితుడు, నిర్మాణ భాగస్వామి కూడాను. దీంతో నాగ వంశీ కోసం భీమ్లా నాయక్ చిత్రాన్ని చకచకా పూర్తి చేశాడు. సంక్రాంతికి విడుదల కావాల్సిన భీమ్లా నాయక్ అనుకోని కారణాల వలన ఫిబ్రవరికి వాయిదా పడింది.
Also Read: ‘వైఎస్ జగన్ ను లేపేస్తాం’.. ఖండించిన జనసేన.. వైరల్..!
అయితే పవన్ ఒప్పుకున్న చిత్రాల్లో షూటింగ్ పూర్తి చేయాల్సినవి హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, సురేంధర్ రెడ్డి చిత్రం. అయితే సమయం చాలా తక్కువ ఉండగా పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఫీల్ అవుతున్నట్లు సమాచారం. 2024 ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఇంకా కేవలం రెండు సంవత్సరాల సమయం మాత్రమే ఉంది. గత ఎన్నికల వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ సారి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని పవన్ భావిస్తున్నారు.
2024 ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలంటే ఇప్పటి నుంచి ఎన్నికల ప్రణాళికపై పని చేయాలి. పార్టీని జనాల్లోకి తీసుకెళ్లాలి. కేవలం ఈ సోషల్ మీడియా పోస్ట్స్, మీడియా సమావేశాలు, ఉపన్యాసాల వలన పెద్దగా సాధించేది ఏమీ లేదు. పవన్ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కమిటైన మూడు చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పరిణామాలు పవన్ కళ్యాణ్ ని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి.
హరి హర వీరమల్లు పూర్తి కావడానికి మరో నాలుగైదు నెలల సమయం పడుతుంది. ఇక భవదీయుడు భగత్ సింగ్, సురేంధర్ రెడ్డి చిత్రాలు పూర్తి చేయడానికి మరో ఏడాది కాలం అవసరం. ఎన్నికలకు ఉన్న రెండేళ్లలో ఏడాదిన్నర కాలం సినిమాలకే కేటాయిస్తే ప్రజల్లో విశ్వాసం సంపాదించడం, ఎన్నికలకు సిద్ధం కావడం చాలా కష్టం. కార్యకర్తలు ఎంత యాక్టీవ్ గా ఉన్నా.. నాయకుడు ప్రయత్నం లేకుండా ఏమీ చేయలేరు. మరి ఈ సమస్యను పవన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.
Also Read: ఈ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో ఉందా అయితే వెంటనే తీసేయండి!