Interesting Facts: మామూలుగా మన రూపం ఎలా ఉంటుందో.. అలా చూపించే శక్తి అద్దంకే ఉంటుంది. అద్దం అనేది మన విషయంలో అబద్ధం చెప్పదు. అద్దాన్ని మనం కేవలం మన రూపాన్ని చూసుకోవడానికి మాత్రమే వాడుతాం. కొన్ని కొన్ని సార్లు అర్థం కొన్ని సైంటిఫిక్ ప్రయోగాలకు కూడా బాగా ఉపయోగపడుతుంది.
ఇక ప్రతి ఒక్కరికి ఉదయాన్నే లేవగానే అద్దం ముందు నిలబడి చూసుకునే అలవాటు ఉంటుంది. ఇక అందులో మనం ఎక్కువగా చూసేది మన ముఖాన్ని మాత్రమే. ఇక కొందరు అద్దాన్ని చూడ్డానికి అస్సలు ఇష్టపడరు. చాలా వరకు వాళ్లు చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఉంటారు.
కానీ అద్దాన్ని రోజుకు రెండు నిమిషాలు చూడటం వల్ల విజయం సొంతమవుతుందని సైంటిఫిక్ పరంగా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. అద్దం ముందు నిలబడి మన ముఖాన్ని కాకుండా మరొకటి గమనించాల్సి ఉంటుంది. అద్దం లో ఉన్న మన ప్రతిబింబం మనం ఎలా ఉండాలో అదే చెబుతుంది కాబట్టి అలా నడుచుకుంటాం.
కానీ ప్రతిబింబంను చూడటమే కాకుండా ఒక రెండు నిమిషాలు అలాగే మాట్లాడాలి. అలా మాట్లాడటం వల్ల మనలో ఉన్న లోపాలు కూడా తెలిసిపోతుంటాయి. అలా అద్దం ముందల నిల్చొని మన మైండ్ లో మనం ఎలా ఉండాలో ఊహించుకోవాలి. అలా ఊహించుకున్న తర్వాత అద్దంలో ఎలా ఉన్నామో అదే ప్రతిబింబాన్ని అలాగే ఉన్నట్టుగా విజువల్ చేసుకోవాలి.
ఆ సమయంలో మనం ప్రతిబింబంలో కనుపాపల పై ఫోకస్ చేయాలి. అలా ఫోకస్ చేయడం వల్ల మనం ఊహించుకున్నది మనకు విజువల్ గా కనిపిస్తుంది. ఇది పాజిటివ్ ఎనర్జీగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా మనం అలా ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ కూడా వస్తుంది.