Punjob Elections 2022: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల సమరాన్ని మోగించిన కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఇప్పుడు కరోనా భయపెడుతోంది. ఈ మహమ్మారి విస్తృతి వేళ ఎన్నికల నిర్వహణ సాధ్యమా? అని ఆలోచిస్తోంది. ఎన్నికలు అంటే ఆ జోష్ వేరే లెవల్ లో ఉంటుంది. కార్యకర్తలు, నేతలు, ప్రచారాలు, సభలు సమావేశాలు.. ఇంటింటికి తిరిగి ఓట్లు అడగడాలు.. దీంతో కరోనా మరింతగా ప్రబలే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే కఠిన ఆంక్షలు, కీలక నిర్ణయాల దిశగా ఈసీ ఆలోచిస్తోంది.

పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. పోలింగ్ తేదీని వాయిదా వేయాలంటూ అన్ని పార్టీలు డిమాండ్ చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దళితుల సెంటిమెంట్ కు ముడిపడిన అంశం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.
పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఫిబ్రవరి 14న ఓకే విడతలో పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఆ తేదీని కనీసం వారం రోజులకు వాయిదా వేయాలంటూ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్రకు వరుస లేఖలు రాశాయి. అన్ని పార్టీలు కోరడంతో ఈసీ ఎన్నికలను ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.
పంజాబ్ జనాభాలో 32శాతం మంది దళితులే. పంజాబ్ సహా ఉత్తరాదిలోని దళితులు అమితంగా ఆరాదించే గురు రవిదాస్ జయంతి ఫిబ్రవరి 16న జరుపుతారు. రవిదాస్ జయంతి రోజున పంజాబ్ లోని దళితులు లక్షల సంఖ్యలో ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి వెళ్లి అక్కడ సంత్ పుట్టిన ప్రదేశంలో ప్రార్థనలు చేస్తారు.
పంజాబ్ దళితులు యూపీకి వెళ్లే ప్రక్రియ ఫిబ్రవరి 10 నుంచి 16వ తేదీ మధ్య ఉంటుంది. పంజాబ్ ఎన్నికలు ఫిబ్రవరి 14న పెట్టడంతో వారంతా ఓటు హక్కును వినియోగించుకోలేదు. అందుకే అన్ని పార్టీల కోరిక మేరకు ఎన్నికల తేదీని రవిదాస్ జయంతి తర్వాతకు మార్చింది ఈసీ.
దేశంలో ఐదు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాలో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. పంజాబ్ లో మాత్రమే ఎన్నికల తేదీని ఈసీ మార్చింది.
[…] Bangarraju: ‘బంగార్రాజు’ భారీ అంచనాల మధ్య వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టలేక పోయినా ఓ కోణంలో మంచి కలెక్షన్స్ నే రాబడుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయి నాలుగు రోజులు అవుతున్నా ఇంకా బాగానే కలెక్ట్ చేసింది. మొత్తమ్మీద కలెక్షన్స్ విషయంలో ‘బంగార్రాజు’ ఏ మాత్రం తగ్గ లేదు. నిజానికి ఈ సినిమా కేవలం బ్రేక్ ఈవెన్ కిందే రిలీజ్ అయింది. సినిమాని ముందే జీ5 కి అమ్మేసుకున్నారు. అందుకే, ఫస్ట్ డే నుంచి ఈ సినిమా పూర్తి లాభాల్లోనే నడుస్తోంది. […]