Naga Babu: కొణిదెల వరుణ్ తేజ్, మానుషి చిల్లార్ జంటగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాల ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి సంబంధించి నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. అనంతరం ఈ చిత్ర దర్శకుడి గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఆ దర్శకుడు గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.. ఈ సినిమాకు సంబంధించి చిత్ర హీరో వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని సృష్టించాయి. అవి పెద్ద వివాదానికి కారణమయ్యాయి. దీంతో నాగబాబు స్పందించాల్సి వచ్చింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. తన కొడుకు చేసిన చిత్రాల గురించి ప్రస్తావించారు. అతడు నటించిన చిత్రాల్లో ఫిదా, కంచె, ముకుంద సినిమాలు ఇష్టమని ప్రకటించారు. అలా మాట్లాడుకుంటూనే ” వరుణ్ తేజ్ తన కెరియర్ ప్రారంభం నుంచి సవాళ్లతో కూడుకున్న పాత్రలను ఎంచుకుంటున్నాడు. అది నాకు చాలా గర్వంగా ఉంది. ఆర్మీ తరహా పాత్రలు వరుణ్ తేజ్ ఉన్న ఎత్తుకు చాలా బాగా నప్పుతాయి. 5.3 అడుగులు ఎత్తు ఉండే హీరోలకు ఆపరేషన్ వాలంటైన్ లాంటి పాత్రలు లభిస్తే నప్పవని” నాగబాబు అన్నారు.. దీంతో ఆయన అన్న ఈ మాటలను కొంతమంది హీరోల అభిమానులు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ విమర్శలు చేశారు. ఈ వివాదం కొద్దిరోజులుగా నెట్టింట చర్చకు దారితీస్తోంది. ఇది ఇంకా ముదరకముందే నాగబాబు స్పందించారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు.
“ఆపరేషన్ వాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను మాట్లాడిన మాటలు కొంతమందికి బాధని కలిగించాయని తెలిసింది. పోలీస్ పాత్ర ఆరు అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది. ఐదు అడుగుల మూడు అంగుళాల పొడవున్న వ్యక్తులు చేస్తే ఆ పాత్ర బాగోదు అన్నట్టుగా మాట్లాడాను. ఆ మాటలను నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఎవరైనా ఆ మాటలకు నొచ్చుకొని గనుక ఉండి ఉంటే ఐ యామ్ రియల్లీ వెరీ సారీ. అది యాదృచ్ఛికంగా అన్నది మాత్రమే. కావాలని అన్న మాటలు కావు. అందరూ అర్థం చేసుకొని క్షమిస్తారని” అంటూ నాగబాబు రాసుకొచ్చారు.
కాగా, ఆపరేషన్ వాలంటైన్ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. యుద్ధం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన మిషన్ ఈ ఆపరేషన్ వాలెంటైన్ అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో నవదీప్, పేరుపొందిన నటీనటులు నటించారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. గత కొద్ది సంవత్సరాలుగా వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న వరుణ్ తేజ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇటీవల జరిగిన వరుణ్ బాబు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను,ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను,ఎవరైన ఆ మాటలకి… pic.twitter.com/Ppr44YcqI8
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 29, 2024