DMK Govt : నరేంద్రమోడీ రెండో రోజు కూడా తమిళనాడు పర్యటించారు. మొన్నటి పల్లడం బీజేపీ సభ అద్భుతంగా సాగింది. 5 లక్షల మంది ప్రజలు ఈ సభకు రావడం విశేషం. కోయంబత్తూరులో ఇంతవరకూ ఏ రోజు కూడా ఇటువంటి సభ కనివినీ ఎరుగరు..
దీనిమీద చర్చ మీద చర్చ నడుస్తుంటే.. మీడియా దీన్ని తక్కువ పెట్టి చూపించింది. రెండో రోజు ప్రధాని మోడీ జనం హృదయాలను గెలుచుకున్నారు. తొత్తుకూడిలో అధికార కార్యక్రమం.. తిరునల్వేలి పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండూ కూడా జనం విపరీతంగా వచ్చారు.
ఇక్కడ అతిపెద్ద దారుణమైన సంఘటన జరిగింది. ఇటీవల తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు.. తుత్తుకుడి జిల్లా కులశేఖర పట్నంలో ఇస్రో స్పేస్ పోర్టు నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ స్పేస్ పోర్ట్ ఏర్పాటు చేయించిన ఘనత తమదే అని చెప్పుకోవడానికి స్టాలిన్ ప్రభుత్వం నానా తంటాలు పడింది. గతంలో కేసీఆర్ ఇచ్చినట్టే అక్కడి పత్రికలకు అడ్డగోలుగా జాకెట్ యాడ్స్ ఇచ్చింది.
ఈ యాడ్స్ లో జరిగిన ఓ తప్పిదం స్టాలిన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. చైనా జెండాతో కూడిన ఆ రాకెట్ ను ఆ ఆ ప్రకటనలో ఉంచడం తీవ్ర కలకలానికి దారి తీసింది. కంప్యూటర్ గ్రాఫిక్స్ లో తయారుచేసిన ప్రకటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చిత్రాల వెనుక ఉన్న ఇస్రో రాకెట్ చుట్టూ మన జాతీయ జెండాకు బదులుగా చైనా జాతీయ జెండాను ఏర్పాటు చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.
చైనా జెండాతో భారత శాస్త్రజ్ఞుల్ని అవమానించిన డీఎంకే ప్రభుత్వం తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.