ఇలియానా.. ఒకప్పుడు టాలీవుడ్ లో వెలుగు వెలిగిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో పలు సినిమాల్లో చేస్తోంది. ఈ మధ్య మాల్దీవులు, గోవాల్లో హాట్ హాట్ ఫొజులతో కుర్రకారు మతి పోగోట్టేసింది. దేవదాస్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా నడుము కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారిక్కడ..
ఇక ‘పోకిరి’, రాఖీ, మున్నా, కిక్, జులాయి, శక్తి చిత్రాలతో తెలుగులో వెలుగు వెలిగి ప్రస్తుతం ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఇలియా ఓ ఇంటర్వ్యూలో హాట్ కామెంట్ చేసింది. ‘నా 12 ఏళ్ల వయసు నుంచే నా అందం, శరీరం గురించి పలువురు కామెంట్చేశారని.. ఆ విమర్శలు నా హృదయాన్ని గాయపరిచేవన్నారు. శరీరంలోని కొన్ని భాగాల గురించి నా ఎదుటే కామెంట్లు చేసేవాళ్లు. నాకు ఏమీ తెలియనట్లు వాటి గురించే ఎక్కువగా ఆలోచించేవాన్ని కాదు.. నా శరీరం గురించి వాళ్లకు ఎందుకు అని బాధపడుతూనే ముందడుగు వేశానని’ ఇలియానా తన ఆవేదన చెప్పుకొచ్చింది.
ఇలియానా మాట్లాడింది బ్రెస్ట్ సైజ్ గురించని అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మంచి ఫిజిక్ ఉండే ఇలియానాకు కూడా ఈ రకమైన వేధింపులు వచ్చాయని తెలిసి అందరూ షాక్ కు గురవుతున్నారు.