Jabardasth Comedian Quits Government Job: బుల్లితెరపై జబర్దస్త్ ఓ సెన్సేషనల్ షో. తెలుగులో కామెడీ షోలు వచ్చింది చాలా తక్కువ. వాటిలో సక్సెస్ అయినవి ఇంకా తక్కువ. జబర్దస్త్ మాత్రం ఆ బారియర్స్ బ్రేక్ చేసింది. అన్ని వర్గాల్లోకి దూసుకెళ్లిన జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ సాధించింది. అత్యధిక టీఆర్పీతో తిరుగులేని షోగా రికార్డులకెక్కింది. జబర్దస్త్ షో చాలామంది ఔత్సాహికులకు ప్రోత్సాహం ఇచ్చింది. కమెడియన్స్ గా నిరూపించుకోవాలనుకున్నవారికి మంచి ప్లాట్ ఫార్మ్ గా మారింది. జబర్దస్త్ వేదికపై పేరు తెచ్చుకున్న కమెడియన్స్ వెండితెరపై బిజీ ఆర్టిస్ట్స్ అయ్యారు. మహేష్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, రచ్చ రవి లాంటి కమెడియన్స్ సినిమాల్లో చేస్తున్నారు.

సుడిగాలి సుధీర్ ఏకంగా హీరో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక జబర్దస్త్ కమెడియన్స్ లో వెంకీ ఒకరు. వెంకీ మంకీస్ టీం లీడర్ అయిన వెంకీ మొదట్లో సీనియర్స్ టీమ్స్ లో చేసేవాడు. ఓ ఇంటర్వ్యూలో వెంకీ అనేక వ్యక్తిగత,వృత్తిపరమైన విషయాలను
పంచుకున్నారు. ఆర్టిస్ట్ కావాలి, మనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనేది వెంకీ ఆశ. దాని కోసం కాకతీయ యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ మిమిక్రీ లో గోల్డ్ మెడల్ అందుకున్నారు. చదువు పూర్తయ్యాక సింగరేణితో పాటు ఒకటి రెండు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వచ్చాయట. కానీ ఆ ఉద్యోగాలు వదులుకున్నాడు.

Also Read: Anasuya: సిల్క్ శారీలో సూపర్ సెక్సీగా… అందాల దాడి చేసిన అనసూయ!
ఆర్టిస్ట్ కావాలని గట్టి పట్టుదలతో ఉన్న వెంకీకి చమ్మక్ చంద్ర జబర్దస్త్ లో అవకాశం ఇచ్చాడట. తన మిమిక్రీ షో చూసి చంద్ర తన టీం లోకి తీసుకున్నాడు. అప్పట్లో వెంకీ ఎక్కువగా లేడీ గెటప్స్ వేసేవాడు. ఆ లేడీ గెటప్స్ వేయడం చాలా కష్టమని వెంకీ చెప్పుకొచ్చాడు. చీర కట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికి తోడు పైన విగ్గు, హెవీ మేకప్ వలన చిరాకుగా ఉంటుంది. లేడీ గెటప్స్ వేశాక నాకు ఆడవాళ్ళ గొప్పతనం తెలిసిందని వెంకీ తెలియజేశారు.
వినోద్ వచ్చే వరకు లేడీ గెటప్స్ వెంకీనే వేసేవాడట. చమ్మక్ చంద్ర టీం లో కొన్నాళ్లు చేసిన వెంకీ రాకెట్ రాఘవ టీమ్ కి రావడం జరిగింది. కొందరు సీనియర్స్ జబర్దస్త్ ని వీడడంతో వెంకీకి టీం లీడర్ అయ్యే ఛాన్స్ దక్కింది. వెంకీ మంకీస్ పేరుతో టీం ఏర్పాటు చేశాడు. టీమ్ లీడర్ గా ఏదైనా కొత్తగా చేయాలని, కన్ఫ్యూషన్ కాన్సెప్ట్ ఎంచుకుని స్కిట్స్ రాశాను. అవి బాగా సక్సెస్ అయ్యాయి . నాకు మంచి పేరు వచ్చింది. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే జబర్దస్త్ వలెనే. జబర్దస్త్ నేను కోరుకున్న గుర్తింపు తెచ్చిపెట్టిందని వెంకీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Gautam Adani Donation : అదానీ 60వ పుట్టిన రోజు.. రూ.60 వేల కోట్ల విరాళం