Jagan Government: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు ప్రజల బాట పట్టాయి. విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు బాదుడే బాదుడు, మినీ మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి వేడుకల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చే దసరా నుంచి ప్రత్యేక యాత్రకు సన్నద్ధమవుతున్నారు. దీంతో రాజకీయ హీట్ పెరుగుతోంది. చంద్రబాబు పర్యటనకు జనాలు భారీగా తరలిరావడం, బాదుడే బాదుడు కార్యక్రమానికి విశేష స్పందన వస్తుండడం, అదే సమయంలో వైసీపీ చేపడుతున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు సరికదా ప్రజల నుంచి నిలదీతలు, ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో అధికార పార్టీ కాస్తా కలవరపాటుకు గురవుతోంది. దీనికితోడు పవన్ కానీ ప్రజల్లోకి వస్తే ప్రజల నుంచి వ్యతిరేకత మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అందుకే దానిని అధిగమించేందుకు జగన్ ఉపశమన చర్యలు ప్రారంభించారు. కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. వీలైనంత వరకూ సంక్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు యత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా కీలకమై కోనసీమ జిల్లా వివాదాన్ని తెరదించడానికి నిర్ణయించారు. శుక్రవారం నాడు జరిగే కేబినెట్ సమావేశంలో కీలకంశాలను అజెండాగా చేర్చి చర్చించే అవకాశముంది.
కోనసీమ జిల్లాపై..
ముఖ్యంగా కోనసీమ బీఆర్ అంబేద్కర్ పేరు మార్పు తరువాత జిల్లాలో విధ్వంసకర ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఒక మంత్రి, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఇళ్లనే తగులబెట్టడం ఆందోళన రేకెత్తించింది. పైకి ఇది విపక్షాలపై నెట్టే ప్రయత్నం చేసినా తరువాత జరిగిన పరిణామాలు అధికార పార్టీ ప్రభను మసకబార్చాయి. కేసులో కీలక నిందితులుగా వైసీపీ నాయకులే ఉండడంతో దీనికి వెనుక పెద్దల పాత్రపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కులపరమైన విధ్వంసాలను రేకెత్తించడంలో భాగంగా అధికార పార్టీయే ఈ దురాఘతానికి పాల్పడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ స్థాయి అధికారి నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకూ సస్పెన్షన్ వేటు వేశారు. నిఘా వైఫల్యంగా చెప్పుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం తప్పిదంగానే ఒప్పుకున్నట్టయ్యింది. అయితే ఈ ఘటనలో అరెస్టయిన వారు మీ పార్టీ అంటే మీ పార్టీ అంటూ తొలుత దబాయించారు. చివరకు వారు మంత్రి అనుచరులేనని తేలడంతో మిన్నకుండా పోయారు. అయితే మొత్తం ఎపిసోడ్ లో మాత్రం అధికార పార్టీ వ్యూహం బూమరాంగ్ అయ్యింది. బాధిత మంత్రికి తెలియకుండా కొందరు కీలక పెద్దలు ఆడిన హైడ్రామా అని.. కావాలనే కుల విధ్వంసాలు స్రుష్టించేందుకు ప్రయత్నించారని తేటతెల్లమైంది. ఇది అధికార పార్టీకి మైనస్ కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వం మరోసారి ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశమిచ్చింది. కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు దాదాపు 6 వేల వినతులు వచ్చాయి. వివిధ రంగాల ప్రముఖులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ పక్షాలు తమ అభిప్రయాలను, అభ్యంతరాలను తెలియజెప్పాయి. కానీ ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తుందో.. లేకుంటే ప్రజాభిప్రాయానికి మద్దతు ఇస్తుందో చూడాలి మరీ.
Also Read: Gautam Adani Donation : అదానీ 60వ పుట్టిన రోజు.. రూ.60 వేల కోట్ల విరాళం
పాలనా పరమైన…
ఈ నెల 27న అమ్మ ఒడి నగదు విడుదలకు సీఎం జగన్ శ్రీకాకుళంలో శ్రీకారం చుట్టనున్నారు. ప్రతీ విద్యార్థి తల్లి ఖాతాలో రూ.14 వేలు జమ చేయనున్నారు. దీనికి సంబంధించి నిధుల సమీకరణ ఇప్పటికే పూర్తయ్యింది. కానీ ఈ సారి లక్ష మంది వరకూ లబ్ధిదారులు పథకానికి దూరం కానున్నారని.. గత ఏడాది కంటే మరో రూ.1,000లు తగ్గించి రూ.13 వేలు ఇవ్వనున్నారన్న ప్రచారం సాగుతోంది. దీనికి తెరదించుతూ కేబినెట్ లో చర్చించి ప్రకటన వెలువరించే అవకాశముంది. జిల్లా పరిషత్ చైర్మన్లకు సంబంధించి వారి పదవీకాలం ముగిసే వరకూ ఉమ్మడి జిల్లాలుగానే పరిగణలోకి తీసుకునేలా చట్టసవరణ చేసే అంశంపైనా చర్చించనున్నారు.భూముల ఆక్రమణల నిరోధక చట్టం, అదానీ గ్రీన్ ఎనర్జీ చేపట్టనున్న3,700 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ప్రతిపాదనలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు.బైజుస్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం మేరకు 8వ తరగతి విద్యార్థులకు ల్యాబ్ టాప్ లు అందించే అంశంపైనా కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు. 35 పరిశ్రమలకు సంబంధించి 150 ఎకరాల కేటాయింపుపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
రాజకీయాలపై స్పష్టత…
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సీఎం జగన్ కేబినెట్ లో చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో ప్రధాన పక్షాల మధ్య పొత్తులు, రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ అనుసరించే వైఖరి… ఎందుకు ఎన్టీఏకు సపోర్టు చేస్తున్నామో అన్నదానిపై జగన్ మంత్రివర్గ సహచరులకు స్పష్టతనిచ్చే అవకాశముంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ అలయెన్ష్ అవుతాయని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. దీనిని అడ్డుకునేందుకు జగన్ తో పాటు కీలక నాయకులు ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా జనసేన వరకూ అయితే ఒకే కానీ.. టీడీపీతో కలిసి పనిచేసేది లేదని బీజేపీ పెద్దలు అన్నట్టు టాక్ నడుస్తోంది. అదే సమయంలో ఏపీలో అధికార వైసీపీయే మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు విశ్లేషణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై జగన్ కొన్ని వాస్తవాలు మంత్రులకు వివరించే అవకాశముందన్న టాక్ ఉంది. అటు పాలన, ఇటు రాజకీయాంశాలకు సంబంధించి ప్రాధాన్యతాంశాలుగా కేబినెట్ సమావేశం కొనసాగుతందన్న మాట.
Also Read: Balakrishna’s Younger Brother: బాలకృష్ణ తమ్ముడు చిరంజీవి తో కలిసి నటించిన సినిమా ఏమిటో తెలుసా?