Comedian Satya : నవరసాల్లో హాస్యరసం చాలా కష్టం. నవ్వించడం అంత సులభం కాదు. పంచ్ లో పవర్ లో ఉన్నా ఆర్టిస్ట్ లో టైమింగ్ మిస్ అయితే అది పేలదు. కమెడియన్స్ గా సక్సెస్ అయిన నటులందరూ ఒక్కో ప్రత్యేకమైన శైలి కలిగి ఉన్నారు. డైలాగ్ డెలివరీ నుండి బాడీ లాంగ్వేజ్ వరకు విభిన్నత చూపినపుడే ప్రేక్షకులను ఆకట్టుకోగలం. ముఖ్యంగా సహజ నటన అవసరం. బ్రహ్మానందం, అలీ, కోటా, ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్ లను గమనిస్తే ఎవరి శైలి వారిది.
ఈ జనరేషన్ కమెడియన్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు సత్య. పిల్లజమీందార్ మూవీతో సత్య వెలుగులోకి వచ్చాడు. ఆ మూవీలో కాలేజ్ స్టూడెంట్ పులకేశి పాత్ర చేసి మెప్పించాడు. స్వామిరారా, దోచేయ్, సూర్య వర్సెస్ సూర్య, స్పీడున్నోడు, రంగస్థలం వంటి చిత్రాలతో ఫేమ్ రాబట్టాడు. ఇటీవల విడుదలైన రంగబలి హీరో స్నేహితుడిగా కీలక రోల్ చేశాడు.
రంగబలి మూవీ నిరాదరణ పొందినా సత్య కామెడీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. సత్య పెర్ఫార్మన్స్ గురించి జనాలు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఇక రంగబలి ప్రమోషన్స్ లో భాగంగా కొందరు జర్నలిస్ట్స్ ని ఇమిటేట్ చేస్తూ ఆయన నాగ శౌర్యతో చేసిన ఇంటర్వ్యూ ఎపిసోడ్స్ హైలెట్ అయ్యాయి. సత్య కామెడీ టైమింగ్ అద్బుతంగా ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ బాగా నవ్వు తెప్పిస్తాయి. ఆయన రూపం, ఆహార్యం, ముఖకవళికలు అలరిస్తాయి. ముఖ్యంగా సహజంగా నటిస్తారు.
స్టార్ కమెడియన్ గా వెలిగిపోతున్న సత్య ఒకప్పుడు కూలి పనులకు వెళ్ళాడట. అమలాపురంకి చెందిన సత్య నటుడు కావాలని పరిశ్రమలో అడుగుపెట్టాడు. హైద్రాబాద్ లో రోజూ ఏదో ఒక పని చేసుకుంటూ పాత్రల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవాడట. నితిన్ హీరోగా తెరకెక్కిన ద్రోణ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. నిఖిల్ కళావర్ కింగ్ మూవీతో నటుడిగా అరంగేట్రం చేశాడు. పిల్లజమీందార్ మూవీ తర్వాత ఆయనకు నటుడిగా ఆఫర్స్ పెరిగాయి. కెరీర్ బిగినింగ్ లో ధన్ రాజ్ టీమ్ లో జబర్దస్త్ కమెడియన్ గా కూడా చేశాడు. ఇప్పుడు స్టార్ అయ్యాడు.