Maharshi Raghava : మనసున్న ‘మహర్షి’ రాఘవ.. రికార్డు స్థాయిలో 97 సార్లు రక్తదానం

1998 అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి ఐ & బ్లడ్ బ్యాంక్ స్థాపన నాటి నుంచి.. నిర్విరామంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ నేటితో 97వసారి రక్తదానం చేసిన *మానవతా మూర్తి శ్రీ మహర్షి రాఘవ ఎందరికో ఆదర్శం. సీసీటీలో అత్యధికసార్లు రక్తదానం చేసిన దాతగా శ్రీ మహర్షి రాఘవ నిలవడం అభినందనీయం.

Written By: NARESH, Updated On : July 15, 2023 7:58 pm
Follow us on

Maharshi Raghava : తెరపై నటుడు.. తెర ముందు మానవతావాది.. మనసు నిష్కల్మషం.. ఆలోచన సేవా మార్గం..చిరంజీవి బాటలో ప్రయాణం.. రక్తదాతగా ఆయన పేరు లిఖితం.. అలుపెరుగని దాత.. చిరంజీవి గారు ఆయనకు స్ఫూర్తి ప్రదాత.. ఆయనే.. శ్రీ మహర్షి రాఘవ గారు..

1998 అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి ఐ & బ్లడ్ బ్యాంక్ స్థాపన నాటి నుంచి.. నిర్విరామంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ నేటితో 97వసారి రక్తదానం చేసిన మానవతా మూర్తి శ్రీ మహర్షి రాఘవ ఎందరికో ఆదర్శం. సీసీటీలో అత్యధికసార్లు రక్తదానం చేసిన దాతగా శ్రీ మహర్షి రాఘవ నిలవడం అభినందనీయం.

రక్తం అందక ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదనే మంచి మనసుతో బ్లడ్ బ్యాంకును స్థాపించిన చిరంజీవి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యులలో *శ్రీ మహర్షి రాఘవ గారు ఉండటం అభినందనీయం. ఆ దేవదేవుడు శ్రీ మహర్షి రాఘవ గారికి ఆయురారోగ్యాలు, సుఖఃసంతోషాలు కలుగజేయాలని వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా అందరూ కోరుకుంటున్నారు.

రక్తదాతగా మహర్షి రాఘవకి చిరంజీవి తరపున ఆయనకు మనఃపూర్వక ధన్యవాదాలు చిరంజీవి బ్లడ్ సెంటర్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ తెలియజేశారు.