https://oktelugu.com/

Anushka Shetty: టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కి ప్రతీ ఏడాది ఐ-ఫోన్ బహుమతిగా ఇస్తున్న అనుష్క..అతనంటే అనుష్క కి అంత ప్రేమ ఎందుకు?

కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టడంతో అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. అప్పట్లో విజయశాంతి కి ఎలాంటి సూపర్ స్టార్ హీరోయిన్ ఇమేజి వచ్చిందో, అనుష్క కి కూడా అలాంటి సూపర్ స్టార్ ఇమేజి వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 17, 2024 / 02:57 PM IST

    Anushka Shetty

    Follow us on

    Anushka Shetty: సౌత్ ఇండియా లో ఫిమేల్ క్యాటగిరీ లో సూపర్ స్టార్ రేంజ్ ని దక్కించుకున్న స్టార్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది అనుష్క శెట్టి మాత్రమే. అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘సూపర్’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈమె, ఆ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా అవకాశాలు క్యూ కట్టాయి. ‘విక్రమార్కుడు’ చిత్రం తో కెరీర్ లో మొట్టమొదటి సూపర్ హిట్ ని అందుకున్న అనుష్క, ఆ చిత్రం తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ,సూపర్ హిట్స్ ని అందుకుంటూ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అలా హీరోయిన్ గా కొనసాగుతున్న రోజుల్లోనే ఈమెకు ‘అరుంధతి’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం దక్కింది.

    ఆ సినిమా కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టడంతో అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. అప్పట్లో విజయశాంతి కి ఎలాంటి సూపర్ స్టార్ హీరోయిన్ ఇమేజి వచ్చిందో, అనుష్క కి కూడా అలాంటి సూపర్ స్టార్ ఇమేజి వచ్చింది. కేవలం ఈమెని చూసేందుకు లక్షల సంఖ్యలో అభిమానులు థియేటర్స్ కి క్యూ కట్టేవారు. అలాంటి రేంజ్ ని సంపాదించుకున్న బాహుబలి చిత్రంతో పాన్ ఇండియన్ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టిన అనుష్క ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే అనుష్క తో పనిచేసిన ప్రతీ ఒక్కరు ఆమె మంచితనం గురించి, గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్తుంటారు. రీసెంట్ గా ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ అనుష్క మంచితనం గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘అనుష్క గారు క్యారక్టర్ లో ఎంతో ఉన్నతమైనది. ఆమె మంచితనం చూసి ఇలాంటోళ్ళు కూడా భూమి మీద ఉంటారా అని ఆశ్చర్యం వేయకతప్పదు. నేను అంటే ఆమెకి ఎంతో ప్రత్యేకమైన అభిమానం. ప్రతీ ఏడాది సెప్టెంబర్ నెలలో అనుష్క నాకు ఐ ఫోన్ కొత్త మోడల్ ని బహుమతిగా ఇస్తూ ఉంటుంది.

    నా మీద ఆమె చూపించే ఈ ప్రత్యేకమైన ప్రేమకు నేను కృతజ్ఞుడిని’ అంటూ చెప్పుకొచ్చాడు థమన్. ప్రతీ ఏడాది ఐఫోన్ బహుమతి అంటే సాధారణమైన విషయం కాదు. ఐ ఫోన్ వేలల్లో మొదలై, లక్షల్లో కూడా దాని ధర ఉంటుంది. అలాంటి ఐ ఫోన్ ప్రతీ ఏడాది గిఫ్ట్ గా పంపడం అంటే సాధారణమైన విషయం కాదు. అనుష్క హీరోయిన్ గా నటించిన సినిమాలలో ‘భాగమతి’, ‘రగడ’ చిత్రాలకు మాత్రమే థమన్ సంగీతం అందించాడు, కేవలం రెండు సినిమాలతోనే వీళ్ళ మధ్య ఇంత రిలేషన్ ఏర్పడిందా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.