Comedian Raghu Father Passed Away: తెలుగు చిత్రసీమలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు రఘు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెంకట్రావ్ కారుమంచి కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. కొంతకాలంగా వెంకట్రావ్ అనా కమెడియన్ రోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకట్రావ్ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అయన గతంలో ఆర్మీ అధికారిగా దేశానికి సేవలదించారు. రిటైర్మెంట్ తర్వాత ఇంటిదగ్గరే ఉంటున్నారు.
రఘు తండ్రి వెంకట్రావ్ మృతి పట్ల జబర్దస్త్ కమెడియన్స్ విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పెరిగిన వయసు రీత్యా ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, నిన్న రాత్రి ఉన్నట్టు ఉండి ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో వెంటనే తేరుకున్న ఆయన కుటుంబ సభ్యులు, హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు.
అయితే, డాక్టర్ల ట్రీట్మెంట్ కి మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినప్పటికీ, ఆ తర్వాత వెంకట్రావ్ ఆరోగ్యం బాగా దెబ్బ తింది. దాంతో ఆయన చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. వెంకట్రావ్ అకాల మరణం పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున వెంకట్రావ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.