Chanakya Niti: భారత దేశంలో పురాతన విశ్వవిద్యాలయాల్లో తక్షశిల ప్రధానమైనదని తెలుస్తోంది. ఇందులో ఆచార్య చాణక్యుడు బోధించేవారు. దీంతో ఆయన నీతిశాస్త్రంలో ఎన్నో విషయాలు చెప్పాడు. మనిషి జీవితంలో ఏ సమస్యలు ఎదుర్కొంటాడు? వాటికి పరిష్కారాలేమిటి? అనే విషయాలను ప్రముఖంగా ప్రస్తావించాడు. మనిషి జీవితంలో చేసే తప్పులను చెబుతూ వాటిని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా సూచించాడు. దీంతో ఆయన చెప్పిన విషయాలు అందరికి ఎంతో ఉపకరిస్తున్నాయి. తక్షశిలలో చదువుకున్న వారు ఎందరో రాజులుగా రాణించారు. ఉన్నత శిఖరాలు అధిరోహించారు.

ఆచార్య చాణక్యుడు తన విద్యార్థులకు ఓ నీతి కథ చెప్పాడు. అడవిలో ఒక జింక నిండు గర్భిణి కావడంతో పురిటి నొప్పులతో బాధపడుతోంది. ప్రసవ వేదనతో అల్లాడుతోంది. అనువైన స్థలం కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలో దానికి ఓ దట్టమైన గడ్డి భూమి కనబడింది. దీంతో అక్కడికి వెళ్లి ప్రసవం చేసుకోవాలని భావించింది. దాని పక్కనే ఓ నది ప్రవహిస్తోంది. అప్పుడే కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులు భయపెడుతున్నాయి. దీంతో పిడుగు పడి గడ్డికి అగ్ని అంటుకుంది. అదే సమయంలో కుడివైపున ఓ సింహం పొంచి ఉంది.
Also Read: National Flag : జాతీయ జెండా ఎలా మడవాలి? ప్రభుత్వం సూచనలివీ?
దీంతో జింకకు భయం ఎక్కువైంది. మరోవైపు ఎడమవైపు ఓ వేటగాడు బాణం గురిపెట్టాడు. మూడు వైపుల ముప్పు పొంచి ఉండటంతో జింక బెదరలేదు. భారం భగవంతుడి మీద భారం వేసింది. అన్ని వైపులా ముప్పు ఉన్నా జింక తన ప్రసవం మీద దృష్టి పెట్టింది. తన బిడ్డ కోసం అన్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. కానీ ప్రకృతి కరుణించింది. మళ్లీ పిడుగు పడింది. ఆ కాంతికి వేటగాడి బాణం గురి తప్పింది. జింకకు గురిపెట్టిన బాణం సింహానికి తగిలింది. వర్షం రావడంతో అగ్గి ఆరిపోయింది.

జీవితంలో సమస్యలు చుట్టుముట్టినప్పుడు ప్రశాంతంగా ఉంటే మన కష్టాలు అవే దూరమవుతాయి. అంతేకాని ఏదో చేయాలనే ఉద్దేశంతో ఏవో చేసి సమస్యలు కొని తెచ్చుకోవద్దు. ఈ కథలో జింక పరిస్థితులకు వెరవక ప్రశాంతంగా ఉండటంతో బిడ్డను కన్నది. మనం కూడా జీవితంలో ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా నిదానంగా ఉండటమే అన్నింటికి సమాధానంగా కనిపిస్తోంది. ఆచార్య చాణక్యుడు చెప్పిన కథలో నీతి ఏమిటో అర్థమయ్యే ఉంటుంది కదా. అందుకే మనం కూడా జీవితంలో బాధలకు ఎదురీదాలి. అంతేకాని బాధలను తలుచుకుని బాధలకు గురికావద్దని తెలుస్తోంది.
Also Read:Pawan Kalyan: ఏపీని కబళిస్తున్న విషవాయువులు.. ప్రశ్నించిన పవన్