Comedian Devraj Patel Passed Away: ప్రముఖ కమెడియన్ దేవరాజ్ పటేల్ అకాల మరణం పొందాడు. దేవరాజ్ మరణంతో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగింది. సీఎం భూపేష్ బఘేల్ సంతాపం ప్రకటించారు. దేవరాజ్ పటేల్ సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యాడు. అతని వీడియోలు, రీల్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. దేవరాజ్ పటేల్ కి యూట్యూబ్ ఛానల్ ఉంది. నాలుగు లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ‘దిల్ సే బురా లగ్తా హై’ అనేది దేవరాజ్ ఫేమస్ డైలాగ్. ఈ డైలాగ్ తో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు.
ఛతీస్ ఘడ్ రాష్ట్రంలో దేవరాజ్ పటేల్ అభిమానులను సంపాదించుకున్నాడు. దీంతో అతనికి సినిమా, డిజిటల్ సిరీస్లలో అవకాశాలు వచ్చాయి. దేవరాజ్ పటేల్ దిండోరా అనే వెబ్ సిరీస్లో నటించాడు. ఆ సిరీస్లో అతడు విద్యార్థి పాత్ర చేశాడు. మరణానికి కొన్ని నిమిషాల ముందు దేవరాజ్ పటేల్ ఒక రీల్ చేయడం విశేషం. అదే అతడి చివరి రీల్ అయ్యింది.
రాయ్ పూర్ లో షూటింగ్ జరుగుతుండగా పాల్గొనేందుకు దేవరాజ్ పటేల్ రోడ్డు మార్గాన వెళుతున్నాడు. ఆ సమయంలో అతను ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలపాలైన దేవరాజ్ కన్నుమూశారు. దేవరాజ్ మృతికి చిత్ర ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.
ఛతీస్ ఘడ్ సీఎం భూపేష్ బఘేల్ దేవరాజ్ మృతిపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా సందేశం పోస్ట్ చేశాడు. దిల్ సే బురా లగ్తా హై డైలాగ్ తో మనల్ని అందరినీ నవ్వించిన దేవరాజ్ పటేల్ మృతి బాధాకరం. తన కళతో ఉన్నత శిఖరాలు ఎక్కాల్సిన దేవరాజ్ అకాల మృతి చెందాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేవరాజ్ పటేల్ కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
“दिल से बुरा लगता है” से करोड़ों लोगों के बीच अपनी जगह बनाने वाले, हम सबको हंसाने वाले देवराज पटेल आज हमारे बीच से चले गए.
इस बाल उम्र में अद्भुत प्रतिभा की क्षति बहुत दुखदायी है.
ईश्वर उनके परिवार और चाहने वालों को यह दुःख सहने की शक्ति दे. ओम् शांति: pic.twitter.com/6kRMQ94o4v
— Bhupesh Baghel (@bhupeshbaghel) June 26, 2023