Keerthy Suresh: కీర్తి సురేష్ రాజకీయాల్లోకి వస్తున్నార్న ప్రచారం జోరందుకుంది. అందుకు ఆమె రీసెంట్ కామెంట్స్ కారణమయ్యాయి. కీర్తి సురేష్ లేటెస్ట్ మూవీ మామన్నన్. ఉదయనిధి స్టాలిన్ హీరో కాగా వడివేలు కీలక రోల్ చేశారు. ఇది పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. జూన్ 29న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ… అందరూ పొలిటిక్స్ లోకి వస్తున్నారా? అని అడుగుతున్నారు. దాని గురించి ఆలోచించాలి, అని కామెంట్ చేశారు.
కీర్తి సురేష్ ఆలోచన విధానం చూస్తే ఆమెకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉంది. వెంటనే కాకపోయినా భవిష్యత్ లో ఆమె ఏదో ఒక పొలిటికల్ పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కీర్తి సురేష్ బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఆమె తల్లి మేనకా సురేష్ ఖండించారు. కీర్తి రాజకీయాల్లోకి వస్తే సంచలనం అవుతుంది. కాగా కోలీవుడ్ స్టార్ విజయ్ వచ్చే ఎన్నికల్లో బరిలో దిగుతారంటూ ప్రచారం జరుగుతుంది.
పూర్తి స్థాయిలో రాజకీయాలు చేసేందుకు ఆయన సిద్ధం అవుతున్నాడట. ఇక కీర్తి విషయానికి వస్తే ఆమె హీరోయిన్ గా ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి అరడజను సినిమాల వరకూ చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ రిలీజ్ దసరా భారీ విజయం సాధించింది. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు కాగా నాని హీరోగా నటించారు.
ప్రస్తుతం ఆమె భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా తెరకెక్కుతుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్ర చేయడం విశేషం. ఒక స్టార్ హీరోయిన్ సిస్టర్ రోల్ చేయడం ఊహించని పరిణామం. కీర్తి అందరిలాంటి హీరోయిన్ కాదని నిరూపించుకుంది. గతంలో కూడా ఆమె రజినీకాంత్ చెల్లి పాత్ర చేశారు.