బాధ్యత ఉండక్కర్లే.. వ్యాపారులపై ఫైర్ అవుతున్న అలీ

కరోనా నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని నటుడు, కామెడీయన్ అలీ అన్నారు. కొందరు వ్యాపారులు ఇలాంటి విపత్కర పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు నిత్యావసర సరుకుల ధరలు రేట్లను పెంచి సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది డబ్బులు సంపాదించే సమయం కాదని, నిత్యావసర సరుకులు ఎంత రేటు ఉన్నాయో అంతకే అమ్మాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. దీంతో కూలీ, నాలీ […]

Written By: Neelambaram, Updated On : March 26, 2020 1:15 pm
Follow us on

కరోనా నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని నటుడు, కామెడీయన్ అలీ అన్నారు. కొందరు వ్యాపారులు ఇలాంటి విపత్కర పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు నిత్యావసర సరుకుల ధరలు రేట్లను పెంచి సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది డబ్బులు సంపాదించే సమయం కాదని, నిత్యావసర సరుకులు ఎంత రేటు ఉన్నాయో అంతకే అమ్మాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. దీంతో కూలీ, నాలీ చేసుకునే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు. కరోనాను నివారించేందుకు తనవంతు సాయంగా ఏపీ, టీఎస్ ప్రభుత్వాలకు చెరో లక్ష రూపాయల విరాళం ఇస్తున్నట్లు అలీ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి విజృంభిస్తుందని తెలిపారు.

ఇటలీలో కరోనాతో మృతిచెందిన వారి మృతదేహాలను కూడా తీసుకెళ్లడానికి ఎవరు రావట్లేదని అలీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నుంచి దేశం విముక్తి పొందాలని పదిరోజులుగా ఇంట్లోనే నమాజ్ చేస్తున్నానని అలీ తెలిపారు. ప్రభుత్వాలు నిబంధనలు తూచతప్పకుండా పాటిస్తూ అందరూ స్వీయనియంత్రణ పాటించి కరోనా మహమ్మరిని దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.