భారత్ లో కారోన మహమ్మారి వ్యాప్తి పట్ల నిర్లక్ష్యం వహిస్తే.. మే సగం నాటికి 13 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని శాస్తవేత్తలు హెచ్చరించారు. ఇతర దేశాలతో పోలిస్తే ఈ అంటువ్యాధిని అరికట్టడానికి భారత్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా కరోనా పరీక్షలను తరచుగా నిర్వహించడంతో బాగా వెనుకబడిందని అభిప్రాయపడ్డారు.
కారోన వైరస్ కు ఇంతవరకు వ్యాక్సిన్ గానీ.. మందుగానీ కనుగొనలేదు. ఈనేపథ్యంలో రెండో దశ, మూడో దశలో వైరస్ వ్యాప్తిని అరికట్టనట్లయితే భారత్‌లో పరిస్థితులు దారుణంగా ఉంటాయి’’ అని భారత్ మేధావులు, డేటా సైంటిస్టుల సముదాయం హెచ్చరించింది.
అదే విధంగా అగ్రరాజ్యం అమెరికా, ఇటలీలో ఈ మహమ్మారి క్రమక్రమంగా విస్తరిస్తూ ఒక్కసారిగా విస్పోటనం చెందింది. భారత్ కూడా కరోనా వ్యాప్తిని త్వరగా కట్టడి చేయకపోతే ఇలాంటి ఫలితాలే చవిచూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత జనాభాకు తగినట్లుగా వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని వెల్లడించారు. ఇక కరోనా ప్రభావం వైద్య సిబ్బందిపైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
కాగా కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా భారత్ మంగళవారం రాత్రి నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.