https://oktelugu.com/

కామెడీయన్ అలీ కూతురు తెరంగేట్రం

తెలుగు చిత్రపరిశ్రమలో అలీ గురించి తెలియని వారుండరు. అలీ కామెడీయన్ గా, హీరో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా అలీ ‘మా గంగానది’ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో అలీ చిన్న కూతురు బేబీ జువేరియా కీలక పాత్రలో నటించనుంది. ‘మా గంగానది’ మూవీతో జువేరియా సినిమారంగంలోకి అడుగుపెడుతుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను మహిళల దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ‘మా గంగానది’ మూవీకి ఉపశీర్షిక ‘అంత ప్ర‌విత్ర‌మైనది స్త్రీ’. ఈ మూవీలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 9, 2020 / 07:40 PM IST
    Follow us on

    తెలుగు చిత్రపరిశ్రమలో అలీ గురించి తెలియని వారుండరు. అలీ కామెడీయన్ గా, హీరో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా అలీ ‘మా గంగానది’ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో అలీ చిన్న కూతురు బేబీ జువేరియా కీలక పాత్రలో నటించనుంది. ‘మా గంగానది’ మూవీతో జువేరియా సినిమారంగంలోకి అడుగుపెడుతుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను మహిళల దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు.

    ‘మా గంగానది’ మూవీకి ఉపశీర్షిక ‘అంత ప్ర‌విత్ర‌మైనది స్త్రీ’. ఈ మూవీలో హీరోయిన్‌గా నియా నటిస్తోంది. ఈ మూవీలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను కథాంశంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు బాల నాగేశ్వరరావు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. దీనిని ఎం.ఎన్‌.యు. సుధాకర్‌, వి. నాగేశ్వర్‌రావు, సూర్యవంతం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మియాపూర్‌లోని పీఎస్ఎస్ మ‌హిళా ట్రస్ట్‌లో చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ముగాంభికా బ్యాన‌ర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం ‘మా గంగానది’. స్త్రీలకు సంబంధించిన కథతో వస్తున్న చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని చిత్రయూనిట్ కోరింది. ఈ మూవీలో అలీ వారసురాలు బేబీ జువేరియా ఓ కీలక పాత్రలో నటించనుంది. కామెడియన్ అలీ చిన్నతనంలోనే సినిమా రంగంలోకి ప్రవేశించి మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. తాజా అలీ చిన్నకూతురు ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేస్తుండటం ఆసక్తిని రేపుతోంది.