https://oktelugu.com/

త్రివిక్రమ్ తో స్టార్ హీరోల కలయికలు !

నేషనల్ స్టార్ ప్రభాస్ తో త్రివిక్రమ్ లాంటి టాలెంటెడ్ అండ్ స్టార్ డైరెక్టర్ సినిమా చేస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారు. పైగా ఆ సినిమాకు ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతోంది. ఎలాగూ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ కి ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే అందరి హీరోల చూపు త్రివిక్రమ్ వైపే ఉంటుంది. అందుకేనేమో మెగా ఫ్యాన్స్ కూడా త్రివిక్రమ్ – రామ్ చరణ్ కాంబినేషన్ కోసం అలాగే త్రివిక్రమ్ […]

Written By:
  • admin
  • , Updated On : November 5, 2020 / 07:27 PM IST
    Follow us on


    నేషనల్ స్టార్ ప్రభాస్ తో త్రివిక్రమ్ లాంటి టాలెంటెడ్ అండ్ స్టార్ డైరెక్టర్ సినిమా చేస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారు. పైగా ఆ సినిమాకు ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతోంది. ఎలాగూ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ కి ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే అందరి హీరోల చూపు త్రివిక్రమ్ వైపే ఉంటుంది. అందుకేనేమో మెగా ఫ్యాన్స్ కూడా త్రివిక్రమ్ – రామ్ చరణ్ కాంబినేషన్ కోసం అలాగే త్రివిక్రమ్ – మెగాస్టార్ కాంబినేషన్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ కలయికల్లో సినిమా అంటే నిజంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. నిజంగా ప్రభాస్ – త్రివిక్రమ్ సినిమా అంటే.. నేషనల్ వైజ్ గా ఫుల్ గిరాకీ ఉంటుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    పైగా పాన్ ఇండియా సినిమాగా కూడా ఈ సినిమాకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే త్రివిక్రమ్ – ప్రభాస్ కలయికలో సినిమా రావడానికి మరో మూడేళ్లు సమయం పడుతోంది. ఇక చరణ్ తో సినిమా మాత్రం అన్ని కుదిరితే మరో రెండేళ్లల్లో సినిమా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటికైనా త్రివిక్రమ్, రామ్ చరణ్ సినిమా చేయాలని మెగా ఫ్యాన్స్ కూడా ఎప్పటినుండో ఆశ పడుతున్నారు. అయితే త్రివిక్రమ్, ఎప్పుడూ చరణ్ చేయడానికి కథను సిద్ధం చేసుకోలేదు. కానీ ఈ లాక్ డౌన్ లో చరణ్ కోసం కూడా త్రివిక్రమ్ ఒక కథను సిద్ధం చేశాడట.

    Also Read: బోల్డ్ వెబ్ సిరీస్ లో రాశి, నభా !

    చరణ్ కి కూడా త్రివిక్రమ్ ఇప్పటికే ఆ ఇంట్రస్టింగ్ లైన్ చెప్పాడట. నిజానికి ఎన్టీఆర్ తో సినిమా తరువాత, త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమాని ప్లాన్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ప్లేస్ లో మహేష్ సినిమా వచ్చిందని.. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ – చరణ్ సినిమా ఉంటుందని, ఆ సినిమా తరువాత మెగాస్టార్ తో కూడా త్రివిక్రమ్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే మహేష్ సినిమా మీద త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నాడు. పక్కా కమర్షియల్ గా ఈ సినిమా సాగనుంది.

    Also Read: క్రేజీ రూమర్ : ఛత్రపతి శివాజీగా మహేష్ బాబు !

    అలాగే ఈ సినిమాలో దొంగ స్వామిజీల మీద ఒక మెసేజ్ కూడా ఉండబోతుందని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. ఏమైనా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా… వంద శాతం కమర్షియల్ ఎంటెర్టైనర్ అనేది దాదాపు మహేష్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే వీరి కలయికలో సినిమా రావడానికి మరో రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది.